RCBVSCSK: ఐదేళ్ల తర్వాత చెన్నైపై గెలవనుందా..

RCBVSCSK: ఐదేళ్ల తర్వాత చెన్నైపై గెలవనుందా..

Updated On : March 23, 2019 / 10:02 AM IST

ఐపీఎల్ 12వ సీజన్‌కు సర్వం సిద్ధమైంది. భారీ అంచనాల మధ్య మొదలవనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2019 మరి కొద్ది గంటల్లో మొదలుకానుంది. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోన్న చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే చెన్నై చేరుకుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్‌తో లీగ్ ఆరంభం కానుంది. 

టీమిండియా మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ వ్యూహాలు రచించడంలో దిట్ట. మరోవైపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బలహీనంత కూడా అదే. సీనియర్లు, స్టార్ ప్లేయర్లతో బరిలోకి దిగే చెన్నైను ఢీకొట్టగలదా.. టైటిల్‌ను ముద్దాడాలని 12 సంవత్సరాల నాటి కల.. స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఫైనల్‌కు చేరుకోలేని పరిస్థితి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుది. 

ఈ పరిస్థితుల్లో బెంగళూరు ఎంతవరకూ పోటీ ఇవ్వగలదు. చెన్నై సీజన్‌కు అన్ని జట్ల కంటే ముందుగానే ప్రాక్టీసు మొదలెట్టేసింది. అదే కాక, నిషేదం తర్వాత సెకండ్ ఎంట్రీ ఇచ్చిన సీజన్‌లో విజయం సాధించి అదే ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. 

ఇరు జట్ల మధ్య గతంలో జరిగిన పాత మ్యాచ్‌ల ఫలితాలను తిరగేస్తే..

చెన్నై సూపర్ కింగ్స్ 15 సార్లు గెలిచి 7సార్లు మాత్రమే ఓడిపోయింది. 
– 2008 నుంచి ఇప్పటివరకూ చెపాక్ స్టేడియం వేదికగా ఆర్సీబీ ఒక్క మ్యాచ్ లోనూ గెలవలేదు. దాంతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ పై ఆఖరి సారి 2014లో మాత్రమే గెలిచింది. 
– సీఎస్కే చెపాక్ స్టేడియం వేదికగా ఆడిన 13 మ్యాచ్ లలో 12 గెలిచి 1 మాత్రమే ఓడిపోయింది. 
– ఇరు జట్ల హోరాహోరీ పోరులో మొత్తంగా కెప్టెన్ కోహ్లీ 732పరుగులు చేస్తే.. కెప్టెన్ ధోనీ 710 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

జట్ల అంచనా: 
చెన్నై:
షేన్ వాట్సన్, డుప్లెసిస్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ దోనీ, కేదర్ జాదవ్, రవీంద్ర జడేజా, బ్రావో, దీపక్ చాహర్, డేవిడ్ విల్లే, శార్దూల్ ఠాకూర్
ఆర్సీబీ: పార్థివ్ పటేల్, మొయిన్ అలీ, విరాట్ కోహ్లీ, డివిలియర్స్, హెట్ మేయర్, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, ఉమేశ్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, నవదీప్ సైనీ, టిమ్ సౌథీ