ఢిల్లీ ఎయిర్ పోర్ట్ : కోరిక తీర్చి ఇంప్రెస్ చేయలేదని మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన మేనేజర్

మహిళా సాధికారత దిశగా సాగిపోతున్నమహిళలు కీచకుల కళ్లనుంచి తప్పించుకోవటానికి పోరాటాలే చేస్తున్నారు. కానీ వారి వేధింపులకు గురవుతున్న సందర్భాల్లో చాలామంది వారి ఉద్యోగాలను సైతం వదులకోవాల్సి వస్తోంది. అటువంటిదే దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్ లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని లైంగిక వేధింపులకు గురైంది. చివరికి ఆమె లొంగకపోవటంతో ఆమెను ఉద్యోగం నుంచి తీసివేశారు.
ఇందిరాగాంధీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్ లోని ఓ ప్రయివేటు లాంజ్ లో గత కొంతకాలం నుంచి 22 ఏళ్ల మహిళ ఉద్యోగం చేస్తోంది. అక్కడ డ్యూటీ మేనేజర్ తో పాటు జనరల్ మేనేజర్ కలిసి..ఆమెను పలు రకాలుగా లైంగిక వేధింపులకు గురి చేశారు.ఇక్కడ ఉద్యోగం చేయాలంటే తమ కోరిక తీర్చాలని ఒత్తిడి తెస్తూ ఆరు నెలల నుంచి వేధింపులు తీవ్రతరం చేశారు. అయినా ఆమె ఒప్పుకోకపోవటంతో ఏదో రకంగా వంకలు పెడుతూ మాటలతో చేతలతో హింసిస్తున్నారు.
వారి బరితెగింపు ఏస్థాయికి వెళ్లిందంటే,.ఆమె బట్టలు మార్చుకుంటున్న సమయం చూసి ఆ రూమ్ లోకి చొరబడి అత్యాచారానికి యత్నించారు. ఆమె ప్రతిఘటించింది. దీంతో ఆమె ఇక లొంగేలా లేదని ..జనరల్ మేనేజర్ ను ఇంప్రెస్ చేసే అవకాశం నీకు వచ్చింది. అయినా నీవు బంగారంలాంటి అవకాశాన్ని పోగొట్టుకున్నావు..ఇక నువ్వు ఉద్యోగంలో ఎలా ఉంటావో చూస్తాం అంటూ డ్యూటీ మేనేజర్ బెదిరింపులకు దిగాడు. ఉద్యోగం అయినా వదులుకుంటా గానీ మీ తుచ్ఛమైన కోరికలకు లొంగేది లేదని తెగేసి చెప్పింది.
దీంతో వారి అహం దెబ్బతింది. ఇక జరిగేదేంటో తెలిసిందే. మంగళవారం (జులై 7,2020)ఉద్యోగం నుంచి తీసేశారు. దీంతో ఆమె గురువారం ఢిల్లీ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జనరల్ మేనేజర్ తో పాటు డ్యూటీ మేనేజర్ ను పోలీసులు అరెస్టు చేశారు.
Read Here>>తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు రైళ్లు.. రూట్లు, టైమింగ్స్ ఇవే!