సింహాద్రి అప్పన్నకు బంగారు తులసి ఆకులు సమర్పించిన భక్తుడు

  • Published By: veegamteam ,Published On : November 22, 2019 / 09:46 AM IST
సింహాద్రి అప్పన్నకు బంగారు తులసి ఆకులు సమర్పించిన భక్తుడు

Updated On : November 22, 2019 / 9:46 AM IST

సింహాచలం మహా పుణ్యక్షేత్రం. విశాఖపట్నానికి 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో వెలసిన సింహాచలం పుణ్యక్షేత్రంలో శ్రీ వరాహ లక్ష్మీ నరంసింహస్వామిగా కొలువై భక్తులతో పూజలందుకుంటున్నాడు. ఈ స్వామిని సింహాద్రి అప్పన్నగా భక్తులు కొలుచుకుంటారు. భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్న సింహాద్రి అప్పన్నకు తులసీ దళాలు అంటే చాలా ఇష్టం. అందుకే భక్తులు తులసీ మాలలతో స్వామివారిని పూజించుకుంటారు.

ఈ క్రమంలో బి.శ్రీనివాస్ అనే భక్తుడు స్వామివారికి 50 బంగారు తులసి పత్రాలను కానుకగా సమర్పించాడు. ఆలయ నిర్వహణాధికారి వెంకటేశ్వర రావు భక్తుడు శ్రీనివాస్ కు ప్రత్యేక దర్శనాన్ని కల్పించారు. ప్రధాన పూజారులు ఆశీర్వచనాలు ఇచ్చిన అనంతరం ప్రత్యేక తీర్థ ప్రసాదాలను అందజేశారు.