జగన్‌ది పైశాచికానందం : మంత్రులతో బూతులు తిట్టిస్తారా..ప్రజాప్రతినిధులేనా?..

సీఎం జగన్ పై టీడీపీ నేత..మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్రావు మరోసారి మండిపడ్డారు. అధికారం చేతిలో ఉంది కదాని సీఎం జగన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనీ..తన మంత్రులతోను…ఎమ్మెల్సీలతోను జగన్ ప్రతిపక్ష నేతలను పచ్చి బూతులు తిట్టించారనీ అసెంబ్లీలోను, మండలిలోను బూతులు తిట్టిస్తు శునకానందం పొందుతున్నారనీ ఘాటుగా విమర్శించారు. అసెంబ్లీలోను..మండలిలోను అసభ్యంగా మాట్లాడుతూ ప్రజాప్రతినిధులమనే విషయాన్ని నేతలు మరచిపోయి నోటికొచ్చినట్లల్లా తిడుతున్నారని వారందరినీ జగన్ ప్రోత్సహిస్తు..జగన్ పైశాచికాందాన్ని పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
జగన్ మెప్పు పొందటం కోసం మంత్రులు విచక్షణ మరచి బూతులు తిడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాజధాని కోసం..లక్షలమంది రోడ్లపైకి వచ్చి పోరాడుతుంటే పట్టించుకోరా? పోరాటంలో 25మంది రైతులు చనిపోతే పట్టించుకోకుండా సీఎం జగన్ తో పాటు మంత్రులు..వైసీపీ నేతలు పైశాచినందాన్ని పొందుతున్నారని విమర్శించారు. కనీసం వారిని పరామర్శించాలనే జ్నానం కూడా సీఎం జగన్ కు గానీ..వైసీపీ నేతలకు లేదని అన్నారు.
రాజధాని తరలింపులు..శాసనమండలి రద్దు..ఇలా సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలన్నీ అనాలోచినతమైనవనీ..ఇటువంటి అవగాహన రాహిత్యపు నిర్ణయాలు తీసుకుంటే ఊరుకునేది లేదని..శాసన మండలి రద్దు చేసేలా జగన్ నిర్ణయం తీసుకుంటే కోర్టుకు వెళతామని దేవినేని తెలిపారు. చేతకాని వాళ్లు అధికారంలోకి వచ్చి తీసుకుని తలతిక్క నిర్ణయాలను న్యాయస్థానంలో ప్రశ్నిస్తామని..పిచ్చి నిర్ణయాలు..ఇష్టారాజ్యంగా తీసుకుని అమలు చేస్తామంటే న్యాయస్ధానాలు ఊరుకోవని దీనిపై జగన్ మరోసారి ఆలోచించాలనిలేదంటూ చరిత్రలో ఇటువంటి దుర్మార్గపు..నియంత..పిచ్చి సీఎం ఉండరనే విషయాన్ని తెలుసుకోవాలని దేవినేని సూచించారు.
ఎంపీ విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు ఉండాల్సింది బైటకాదనీ.. జైల్లోనేనని ఉమ స్పష్టం చేశారు. మండలి రద్దుపై అసెంబ్లీ తీర్మానం చేస్తే కోర్టుకెళ్తామన్నారు. రాజధాని గ్రామంలో విద్యార్థులను వెళ్లగొట్టి క్లాస్ రూముల్ని పోలీసులు ఆక్రమించారనీ దీన్ని మీడియా ప్రసారం చేస్తే.. మీడియా ప్రతినిధులపై నిర్భయ, దిశ కేసులు నమోదు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా గొంతు నొక్కేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు.