తల్లిప్రేమ : ఆకలితో ఉన్న పందిపిల్లకు పాలిచ్చిన కుక్క

  • Published By: veegamteam ,Published On : December 24, 2019 / 09:26 AM IST
తల్లిప్రేమ : ఆకలితో ఉన్న పందిపిల్లకు పాలిచ్చిన కుక్క

Updated On : December 24, 2019 / 9:26 AM IST

జంతువులకు జాతి వైరాలు ఉంటాయి. కోతుల్ని చూస్తే కుక్కలు మొరుగుతాయి. అలాగే పందుల్ని చూసినా కుక్కలు తరుముతుంటాయి. ఆ ప్రాంతంలో ఉన్న కుక్కలన్నీ కలిసి పందుల్ని తరమికొడతాయి. కుక్కలు ఎక్కడ దాడిచేస్తాయోనని పందులు పారిపోతాయి.  కుక్క పిల్లలను కనిపించినా పందులు దాడి చేసి గాయపరుస్తుంటాయి.

కానీ కొన్ని సందర్భాల్లో జంతువులు తమ జాతి వైరాన్ని మరచి వేరే జాతికి చెందిన జంతువులతో స్నేహం చేస్తాయి. అక్కున చేర్చుకుంటాయి. అటువంటిదే ఓ పందిపిల్లకు ఓకుక్క పాలిచ్చింది. ఆకలితో ఉన్న పందిపిల్లకు పాలిచ్చింది ఓ శునకం. చనుబాల కోసం వచ్చిన పందిపిల్లకు అక్కడే నిలబడి పాలిచ్చింది. గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఈ వింత దృశ్యం చోటు చేసుకుంది. అరుదైన దృశ్యాన్ని చూసి స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అదికాస్తా.. వైరల్‌గా మారింది.