జగన్ కీలక నిర్ణయం : ప్రత్యేక హోదా ఉద్యమ కేసులు ఎత్తివేత

ఆంధ్రప్రదేశ్ కేబినేట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్న వైసీపీ ప్రభుత్వం.. ఏపీకి ప్రత్యేకహెదా అవసరం అనే ఉద్ధేశ్యంతో పోరాటం చేసిన యువకులపై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కేసులు పెట్టిందని, అలా యువతీ యువకులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రత్యేక హెదా మాత్రమే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలదని నమ్మి ఎందరో యువతీ, యువకులు పోరాటం చేశారని వారిపై పెట్టిన కేసులను ఎత్తి వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
కేబినేట్ లో తీయసుకున్న నిర్ణయాల గురించి వివరించిన మంత్రి పేర్ని నానీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గడిచిన ఐదేళ్లలో ఉద్యమాన్ని అణచివేసేందుకు టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని, ఆ కేసులను ఎత్తివేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
2014 నుంచి 2019వరకు పోరాటం చేయగా వాళ్లపై పెట్టిన క్రిమినల్ కేసులు ఎత్తివేస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన కోసం ఉద్యమించిన అందరి కేసులు ఎత్తివేయనున్నారు.