చిన్నారులతో సహా భార్యాభర్తలు ఆత్మహత్య

కర్నూలు: జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది… ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవటం స్థానికంగా సంచలనం రేగింది. నందికొట్కూరులోని బ్రహ్మంగారిమఠంలో ఈ ఘోరం జరిగింది. ఇద్దరు చిన్నారులతో సహా భార్య, భర్తలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.
మృతులను రామాంజనేయులు (28) వసంత (26) రామలక్ష్మి (7) రమేష్ (5) గా గుర్తించారు.గ్యాస్‌స్టవ్ రిపేర్లు చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునే వీరాంజనేయులు కుటుంబం ఆత్మహత్యపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థినీ..పరిశరాలను క్షుణ్ణంగా పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబకలహాలతో ఆత్మహత్య చేసుకున్నారా? ఎవరైనా హత్యచేశారా? లేదా ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే కోణంలో విచారణ చేపట్టారు.