భారీ అగ్నిప్రమాదం: 30గడ్డి వాములు దగ్ధం

  • Published By: vamsi ,Published On : May 10, 2019 / 04:13 PM IST
భారీ అగ్నిప్రమాదం: 30గడ్డి వాములు దగ్ధం

Updated On : May 10, 2019 / 4:13 PM IST

సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలోని చుట్టుపక్కల ఉన్న 30గడ్డి వాములు తగలబడ్డాయి. మంటలు గ్రామం చుట్టూ వ్యాపంచగా.. గ్రామస్తులు ఆందోళనలో ఉన్నారు. ఫైర్ ఇంజన్‌ మంటలను అదుపులోకి తెచ్చేందుకు రాగా ఫైరింజన్‌లోని నీళ్లు కూడా అయిపోయాయి. గ్రామం చుట్టు అలుముకున్న పొగలు గ్రామానికి చుట్టుపక్కలా అంటుకోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామం నుంచి బిందెలతో గ్రామస్తులు నీళ్లు తెచ్చి మంటలు ఆర్పేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అయితే ఘటనకు గలకారణాలు ఏమిటనేది తెలియరాలేదు.