అయోధ్యను సందర్శిస్తా..రాముడి బాటలోనే నడుస్తా : పాకిస్తానీ క్రికెటర్

  • Published By: nagamani ,Published On : August 12, 2020 / 03:53 PM IST
అయోధ్యను సందర్శిస్తా..రాముడి బాటలోనే నడుస్తా : పాకిస్తానీ క్రికెటర్

Updated On : August 12, 2020 / 4:37 PM IST

అయోధ్య రామమందిర నిర్మాణానికి భూమిపూజ జరగడంపై పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా సంతోషం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఒక పాకిస్థానీ పౌరుడు రాముడి గురించి మాట్లాడటం..అయోధ్యను సందర్శించుకుంటానని చెప్పటం చాలా సంతోషించదగిన విషయం.

రాముడి అందం అతని పేరులో కాకుండా అతని వ్యక్తిత్వంలోనే ఉందని అన్న డానిష్ కనేరియా తనకు అవకాశం లభిస్తే తప్పకుండా అయోధ్యకు వస్తానని చెప్పాడు. తాను ఒక హిందువునని… రాముడు చూపించిన మార్గంలో నడిచేందుకు తాను ఎప్పుడూ ప్రయత్నిస్తానని ట్వీట్ చేశాడు.డానిష్ కనేరియా ట్వీట్ పట్ల పలువురు నెటిజెన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా..ఆగస్టు 5న రామజన్మభూమి అయిన అయోధ్యలో రామమందిరానికి భూమిపూజ జరిగిన సందర్భంగా ..డానిష్ కనేరియా వ్యాఖ్యానిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు ఆనందకరమైన దినమని చెప్పాడు. అయోధ్య అనేది మతపరమైన గొప్ప ప్రదేశమని తన ట్విట్ర్ లో తెలిపిన విషయం తెలిసిందే.