ఓరి ద్యావుడా..రాజమౌళి సినిమా..ఈగ‌ను చంప‌బోతే ఇల్లంతా త‌గుల‌బడింది..!

  • Published By: nagamani ,Published On : September 7, 2020 / 03:10 PM IST
ఓరి ద్యావుడా..రాజమౌళి సినిమా..ఈగ‌ను చంప‌బోతే ఇల్లంతా త‌గుల‌బడింది..!

Updated On : September 7, 2020 / 5:07 PM IST

చేత్తో నలిపేస్తే చచ్చిపోయే అతి చిన్న ప్రాణి ‘ఈగ’. ఈ పేరుతో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తీసిని సినిమా ఎంత హిట్అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లా. ఈ సినిమాలో విలన్ సుదీప్ ని ఈగ ఎంతగా ఇరిటేట్ చేస్తుందో..దాని వల్ల ఇల్లంతా మంటలు చెలరేగిపోయి ఇల్లంతా నానా రచ్చా అయిపోతుంది. ఓ చిన్న ఈగ ఫుల్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.


కానీ నిజంగా ఓ ‘ఈగ’వల్ల ఇల్లంతా తగులబడిపోయిన ఘటన ఫ్రాన్స్ దేశంలోని పార్కౌల్‌-చెనాడ్ గ్రామంలో శుక్రవారం (సెప్టెంబర్ 6,2020) చోటుచేసుకుంది. ఫ్రాన్స్‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధుడు ఈగను చంపడానికి ప్రయత్నించి..తన ఇంటినే త‌గుల‌బెట్టుకున్నాడు. అంతేకాదు ఆ మంట‌ల్లో స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డాడు కూడా.
https://10tv.in/janasena-chief-pawan-kalyan-about-janasainiks-distributing-oxygen-cylinders/


వివ‌రాల్లోకి వెళితే..వృద్ధుడు ఇంట్లో కూర్చుని ఉండ‌గా ఒక ఈగ అత‌ని ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. ఎన్నిసార్లు వెళ్ల‌గొట్టినా పోకుండా అది అత‌ని చుట్టూనే తిరిగడం మొద‌లుపెట్టింది. దీంతో విసిగిపోయాడు పాపం ఆ పెద్దాయన. ఇరిటేట్ అయిపోయాడు. ఈసారి..రా నీ పని చెప్తా..అంటూ దోమల్ని చంపే ఎల‌క్ట్రిక్ బ్యాట్‌ పట్టుకుని రెడీగా కూర్చున్నాడు.



కానీ అది రాలేదు. దీంతో అదెక్కడుందో అని వెతుకుతూ వెతుకుతూ..వంట ఇంటిలోకి వెళ్లాడు. అయితే అప్ప‌టికే వంటింట్లో గ్యాస్ లీక‌వుతున్న విష‌యాన్ని ఈగ ధ్యాసలో ఉన్న వృద్ధుడు గ‌మ‌నించ‌లేదు. ఎక్కడో ఎగురుతున్నట్లుగా కనిపించటంతో ఎల‌క్ట్రిక్ బ్యాట్ బటన్ నొక్కి కొట్టబోయాడు అంతే..!!! బ్యాట్ నుంచి వెలువ‌డ్డ స్పార్క్ వెలువడి గ్యాస్‌కు అంటుకుని ఒక్క‌సారిగా సిలిండ‌ర్ పేలిపోయింది.


ఈ ఘ‌ట‌న‌లో ఇంటి పైక‌ప్పు ఢాంమంటూ తునాతున‌క‌లై ఎగిరిపోయింది. ఈ ఘటనలో వృద్ధుడు అదృష్ట‌వ‌శాత్తు చిన్న చిన్న గాయాల‌తో బతికి బైటపడ్డాడు.కాగా..ఈ ప్ర‌మాదంలో ఈగ చ‌చ్చిందా? లేక త‌ప్పించుకుందా? అనే విషయం మాత్రం తెలియరాలేదు. చిన్నప్రాణియే కదానుకుని ఈగ‌ను చంప‌బోతే ఇల్లంతా కాలిపోయిన ఘటనతో నవ్వలో..ఏడవాలో తెలిక ఆ వృద్ధుడు వెర్రి మొఖం వేసుకుని కాలిపోయిన తన ఇంటిని చూస్తుండిపోయాడు.