కంగ్రాట్స్ : మేఘా విజయం..మోటార్ల ట్రయల్ రన్ విజయవంతం

  • Published By: madhu ,Published On : October 27, 2019 / 12:58 AM IST
కంగ్రాట్స్ : మేఘా విజయం..మోటార్ల ట్రయల్ రన్ విజయవంతం

Updated On : October 27, 2019 / 12:58 AM IST

కరీంనగర్‌ జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌ 2లో నిర్మించిన మోటర్ల ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది. గాయత్రి 8వ ప్యాకేజీలోని చివరి మోటార్ ట్రయల్ సక్సెస్ అవడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు.. అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి కేరాఫ్ అడ్రస్. ప్రాజెక్టు మొత్తం రెండు లింకులలో నిర్మాణం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అతి కీలకమైనది గాయత్రి పంప్ హౌస్. దీన్ని మేఘా ఇంజినీరింగ్ సంస్థ నిర్మించింది. ప్రపంచంలోనే అతిపెద్ద పంప్ హౌస్ గా గాయత్రి పంప్ హౌస్ ఖ్యాతి పొందింది. పంప్ హౌస్ నిర్మాణం పూర్తవడంతో… 7వ మెషీన్ వెట్ రన్ దిగ్విజయంగా నిర్వహించారు.

ఈ 7వ మెషీన్.. భూగర్భ పంపింగ్ స్టేషన్ నుంచి 111 మీటర్ల ఎత్తుకు నీటిని ఒక గంటా 40 నిమిషాల పాటు పంప్ చేసింది. ప్రపంచంలోని ఇతర పంప్ హౌస్ ల కంటే దీని సామర్థ్యం ఎక్కువ. దీనిలోని ఒక్కో మెషీన్ సామర్థ్యం 139 మెగావాట్లు. రోజుకు 2 టీఎంసీల నీటిని పంప్ చేసే సామర్థ్యం దీని సొంతం. 139 మెగావాట్ల సామర్థ్యంతో చేపట్టిన ఏడు పంప్ హౌస్‌లు మేఘా ఇంజనీరింగ్ సంస్థ నైపుణ్యానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అండర్ గ్రౌండ్‌లో భారీ మోటార్లతో పంప్ హౌస్ ఏర్పాటు చేయడం ప్రపంచంలోనే మొదటిసారి. 2వేల 300 టన్నుల బరువు కలిగిన ఒక్కొక్క పంపు 3వేల 500 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తుంది. లక్షాఎనభైవేల హెచ్‌పీ సామర్థ్యం ఈ బాహుబలి పంపుల సొంతం. 

లింక్ 2 ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను లిఫ్ట్ చేయడానికి 6,7,8 ప్యాకేజీలను నిర్మించారు. 6వ ప్యాకేజీ నదిలో 125 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 7 మోటర్లను బిగించగా…6 మోటార్లకు విజయవంతంగా ట్రయల్ రన్‌ నిర్వహించారు. మిగిలిన ఒక్క మోటార్‌కు ఈ నెలాఖరులోగా ట్రయల్ రన్ నిర్వహిస్తామన్న చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు అన్నట్లుగానే అది పూర్తి చేశారు. 8వ ప్యాకేజీలో ఏర్పాటు చేసిన 139మెగావాట్ల సామర్థ్యంతో 7 మోటర్లను ఏర్పాటు చేయగా…మొత్తం మోటర్ల ట్రయల్ రన్‌ విజయవంతం అయ్యింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని అతిపెద్డ మోటార్లను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయడంపై అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. 

ఈ ఏడాది ఆగస్టు 11 న మొదటి‌మిషన్ 5 వ పంపు వెట్ రన్, అదే నెలలో 4వ పంప్ వెట్ రన్ జరిగింది. సెప్టెంబర్‌లో 1వ పంపు, ఈ నెల‌లో 2 మిషన్లు పూర్తి స్థాయి వినియోగంలోకి వచ్చాయి. గాయత్రిపంప్ హౌస్‍‌లో చివరి మోటార్ అయిన 7వ పంప్ వెట్ రన్ కూడా సక్సెస్ అయింది. అన్ని మోటార్లు విజయవంతం కావడంతో… గాయత్రి పంప్ హౌస్‌తో  ప్రపంచ పంపింగ్ కేంద్రాల రికార్డులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ తిరగరాసినట్లయ్యింది.
Read More : ఆర్టీసీ సమ్మె 23వ రోజు : తేలని పంచాయతీ..బస్సు రోడ్డెక్కేనా