ఒక్క నెలలో తిరుమలకు 130కేజీల బంగారం

తిరుమల శ్రీనివాసుడు మరో రికార్డు పట్టేశాడు. జులై నెలలో భక్తుల నుంచి వచ్చిన బంగారం తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. 130కేజీల బంగారంతో రికార్డులకెక్కాడు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. అత్యధిక మొత్తంలో ఇంత బంగారం రావడం ఇదే మొదటిసారి అని పేర్కొంది.
దేశవ్యాప్తంగా వస్తున్న తీర్థ యాత్రికుల ఫలితంగా ప్రతి నెలా 100కేజీల బంగారం, 2600-3000 వెండి ఆభరణాలు వస్తున్నాయని వెల్లడించారు. ఆర్థిక సంక్షోభం, బంగారం రేటు పెరగడం వంటి అంశాలు భక్తుల మొక్కుబడులపై ఎటువంటి ప్రభావం చూపలేదు.
దేశంలోనే రిచ్ దేవస్థానమైన తిరుపతి హుండీ ప్లాటినం, వజ్రాలు, విలువైన రాళ్లతో 3వేల కోట్ల పైన బడ్జెట్ సంపాదిస్తుంది. ప్రతి రోజూ హుండీ ఆదాయం రూ. 3కోట్ల నుంచి రూ.5కోట్ల వరకూ ఉంటుందని అంచనా. బంగారం, వెండి నగలు, ముందు అడ్మినిస్టేటివ్ బిల్డింగ్‌కు తరలించి ఆ తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుంటారు.