అమానవీయం : బాలికకు గర్భస్రావం చేసి..కారులో వెళ్తూ పిండాన్ని విసిరేసిన డాక్టర్

  • Published By: nagamani ,Published On : July 20, 2020 / 01:39 PM IST
అమానవీయం : బాలికకు గర్భస్రావం చేసి..కారులో వెళ్తూ పిండాన్ని విసిరేసిన డాక్టర్

Updated On : July 20, 2020 / 2:58 PM IST

డాక్టర్ అంటే దేవుడితో సమానం అంటారు. కానీ ఓ డాక్టర్ మాత్రం కనీసం ఓ మనిషిగా కూడా ప్రవర్తించలేదు. ఓ 15ఏళ్ల అమ్మాయికి అబార్షన్ చేసిన డాక్టర్ ఆ పిండాన్ని తనతో పాటు కారులో తీసుకెళ్తూ దారి మధ్యలో కారులోంచి ఆ పిండాన్ని చెత్తలోకి విసిరేశాడు. ఈ అమానవీయ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది.

డాక్టర్ వృత్తికే కళంకాన్నితెచ్చాడు ఆ డాక్టర్ ని పోలీసులు శనివారం (జులై 18,2020) అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని అక్రమంగా అబార్షన్ చేసినందుకు డాక్టర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ అబార్షన్ చేసినందుకుగానూ సదరు బాలిక వద్ద డాక్టర్ రూ.15వేలు తీసుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది.

అలాగే బాలికను గుర్తించి ఆమె గర్భానికి కారణమైన ఓ 19ఏళ్ల కుర్రాడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు సునీల్ సర్గ అని అతనిపై అత్యాచారంతోపాటు పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసు గురించి ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ..మణినగర్ ప్రాంతంలో డాక్టర్ షా అనే డాక్టర్ గత 29 సంవత్సరాలనుంచి అహ్మదాబాద్‌లోని వాట్వా జిఐడిసి ప్రాంతంలో ‘కేవల్ మెడికేర్ సెంటర్’ ఆసుపత్రిని నడుపుతున్నాడనీ…అతను జులై 6న ఓ బాలికకు అక్రమంగా గర్భస్రావం చేసి ఆ పిండాన్ని తనతో పాటు హ్యుండాయ్ సాంట్రో కారులో ఇంటికి తిరిగి వెళ్తుండగా మణినగర్ ప్రాంతంలోని ఆవ్కర్ హాల్ సమీపంలో రహస్యంగా చెత్తలో పిండాన్ని విసిరేశాడని తెలిపారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు తమకు సమాచారం ఇవ్వగా అసలు విషయం బైటపడిందని సదరు బాలిక నుంచి డాక్టర్ గర్భస్రావం చేసినందుకు రూ.15వేలుతీసుకున్నట్లుగా తేలిందని తెలిపారు.