రాజధాని తరలింపు పిటీషన్‌పై హైకోర్టు వ్యాఖ్యలు : అర్జంట్ ఏంటీ? సంక్రాంతి తర్వాత చూద్దాం..

ఏపీ రాజధాని అమరావతిపై వేసిన పిటీషన్ హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధాని తరలింపుపై ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వనప్పుడు కోర్టు ఎలా జోక్యం చేసుకుంటుంది అంటూ పిటీషనర్ ను ధర్మాసనం ప్రశ్నించింది.
రాజధాని తరలింపు ప్రక్రియ ఒక్కరోజుతో పూర్తయ్యేది కాదనీ..ఈ విషయంలో అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టంచేసింది. రాజధాని తరలింపు అంశంపై అంత ఎమర్జన్సీగా విచారణ జరపాల్సి అవసరం ఏమి వచ్చింది అని ప్రశ్నించింది. అంతగా అత్యవసరం అనుకుంటే సంక్రాంతి సెలవులు తరువాత పిటీషన్ వేయాలని ధర్మాసనం సూచించింది.
కాగా గుంటూరుకు చెందిన న్యాయవాది కొర్రపాటి సుబ్బారావు రాజధాని అంశంలో జోక్యం చేసుకోవాలని హైకోర్టులో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటీషన్ ను స్వీకరించిన హైకోర్టు సంక్రాంతి సెలవులు తరువాత విచారణ చేయవచ్చు అని వ్యాఖ్యానించింది.కాగా అమరావతి నుంచి విశాఖపట్నానికి రాజధానిని తరలించటంపై జోక్యం చేసుకోవాలంటూ హైకోర్టులో కొర్రపాటి సుబ్బారావు పిటీషన్ వేశారు.
కాగా ఏపీ అసెంబ్లీ సమావేశాల చివరిలో సీఎం జగన్ ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చు అంటూ ప్రతిపాదన చేసిన నాటి నుంచి రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గత 23 రోజుల నుంచి అమరావతికి చెందిన రైతులు..మహిళలు ఆందోళనలు వ్యక్తంచేస్తున్నారు. ప్రజాసంఘాలు..అన్ని రాజకీయ పార్టీలు మూడు రాజధానుల అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలా మూడు రాజధానుల అంశం ఏపీలో తీవ్ర సంచలనానికి దారి తీసింది. ఈ క్రమంలో విశాఖపట్నానికి రాజధాని తరలింపు అంశంపై ధర్మాసనం జోక్యం చేసుకోవాలంటూ అడ్వకేట్ కొర్రపాటి సుబ్బారావు వేసిన పిటీషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది.