బతుకమ్మ పండుగ 9 రోజులు నైవేద్యాలు ఇవే!

  • Published By: veegamteam ,Published On : September 27, 2019 / 09:58 AM IST
బతుకమ్మ పండుగ 9 రోజులు నైవేద్యాలు ఇవే!

Updated On : September 27, 2019 / 9:58 AM IST

తెలంగాణాలో బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటారు. బతుకమ్మ అనే మాట వినగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది పూలు, నైవేద్యాలు. బతుకమ్మ మొత్తం తొమ్మిది రోజులు జరుపుకుంటారు. ఒక్కోరోజు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. 

9 రోజులు తయారు చేసే నైవేద్యాలు : 

> మొదటిరోజు ఎంగిలి పూల బతుకమ్మ : మొదటి రోజు వేడుక అమావాస్య రోజున మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

> రెండో రోజు అటుకుల బతుకమ్మ : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.

> మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో ప్రసాదం తయారు చేసి సమర్పిస్తారు.

> నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.

> ఐదో రోజు అట్ల బతుకమ్మ : అట్లు ప్రసాదంగా సమర్పిస్తారు.

> ఆరో రోజు అలిగిన బతుకమ్మ : ఆశ్వయుజ పంచమి రోజున వస్తోంది. నైవేద్యం సమర్పించరు.

> ఏడో రోజు వేపకాయల బతుకమ్మ : బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

> ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ : నువ్వులను నైవేద్యంగా పెడతారు.

> తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ:  ఈ రోజు మాత్రం ఐదు రకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వులన్నం పెడతారు.

తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు.