ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ

ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 18 మంది ఐఏఎస్‌లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేశారు. ఈమేరకు శుక్రవారం (సెప్టెంబర్ 13, 2019) ఏపీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.
హౌజింగ్ ముఖ్య కార్యదర్శిగా అజయ్ జైన్, పరిశ్రమలు, పెట్టుబడులు శాఖ కార్యదర్శిగా శాంతిలాల్ దండే, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ గా సిద్దార్థ జైన్, గిడ్డంగుల కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా భాను ప్రకాష్, ఆయుష్ విభాగం కమిషనర్ గా పి.ఉషాకుమారి, గిరిజన సహాకార సంస్థ వీసీ అండ్ ఎండీగా పిఎ.శోభ, పునరావాస ప్రత్యేక కమిషనర్ గా టి.బాబురావు నాయుడు, మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కమిషనర్ గా కె.శారదాదేవి, కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్‌గా జి.రేఖా రాణి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ జాయింట్ సెక్రటరీగా చెరుకూరి శ్రీధర్, మర్క్‌ఫెడ్, అగ్రోస్ ఎండీగా ఎల్‌ఎస్.బాలాజీ బదిలీ చేశారు.
రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఎంఏ కిషోర్, ఫైబర్ నెట్ ఎండీగా సుమిత్ కుమార్, ఎపీటీఎస్ ఎండీగా నందకిషోర్, ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ వీసీ, ఎండీగా డి. వాసుదేవ రెడ్డి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు స్పెషల్ కమిషనర్ గా వి. రామకృష్ణ, అర్బన్ ఫైనాన్స్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీగా ఎన్. చంద్రమోహన్ రెడ్డి, ఖనిజాభివృద్ధి శాఖ వీసీ, ఎండీగా మధుసూదన్ రెడ్డి బదిలీ అయ్యారు. జి. అనంతరామును సాధారణ పరిపాలనా శాఖ(జీఎడీ)కు రిపోర్టు చేయాలని ఆదేశించారు.