IPL 2020: టాస్ గెల్చి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోనీ, స్పిన్నర్లే కీలకం.

Chennai Super Kings v Mumbai Indians: చాలాకాలం తర్వాత ధోని మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. IPL 2020 ఫస్ట్ మ్యాచ్‌లో టాస్‌గెల్చి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో గత ఐపీల్ ఫైనల్‌లో ఓడిన ధోనీ ఈసారి ఫ్రెష్‌గా బరిలోకి దిగాడు.
ఐపీఎల్‌లో కాస్త లేటుగా పుంజుకొనే జట్టు ముంబై ఇండియన్స్. రోహిత్ మాత్రం ఈసారి ఆ చాన్స్ తీసుకోవడంలేదు. Abu Dhabi ముంబై ఇండియన్స కి హోం గ్రౌండ్ కిందేలెక్క. అదే చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం, వికెట్ ను ఇంతవరకు చూడలేదు. సరాసరి వచ్చి ఆడుతోంది. అందుకే పిచ్ మీద ధోనికి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చనన్నిది నిపుణుల మాట.