మీకేం సంబంధం? : మూడు రాజధానుల గురించి కేంద్రం అనుమతి అవసరం లేదు : అంబటి 

  • Published By: veegamteam ,Published On : January 25, 2020 / 11:04 AM IST
మీకేం సంబంధం? : మూడు రాజధానుల గురించి కేంద్రం అనుమతి అవసరం లేదు : అంబటి 

Updated On : January 25, 2020 / 11:04 AM IST

ఏపీకి మూడు రాజధానుల విషయంపై బీజేపీ పార్టీతో గానీ..కేంద్ర ప్రభుత్వంతో గానీ చర్చలు జరపాల్సిన అవసరం తమకు లేదని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. మూడు రాజధానుల విషయంపై వైసీపీ ప్రభుత్వం తమతో చర్చించకుండానే నిర్ణయం తీసుకుందని బీజేపీ వ్యాఖ్యలపై అంబటి స్పందిస్తూ..మూడు రాజధానుల అంశం ఏపీకి సంబంధించిన విషయందీనిపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి అవసరం మాకు లేదని అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదనీ..రాజధాని వ్యవహారం ఆ రాష్ట్రానికి..ప్రభుత్వానికి సంబంధించి అంశం..మరి అటువంటప్పుడు కేంద్రంతో మాట్లాడాల్సిన అవసం   మాకేంటి అని ప్రశ్నించారు. 

రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి వికేంద్రీకరణ గానీ, రాజధానులు ఎక్కడ ఏర్పాటు చేయాలి? వాటిని మార్పులు చేసి ఎక్కడకు తరలించాలి? హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలి? అనే విషయాలు కేంద్రానికి సంబంధంలేదని అందుకే కేంద్ర ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం గానీ..చర్చించాల్సిన అవసరం గానీ మాకు లేదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.  ఈ విషయం బీజేపీ నేతలు తెలుసుకోవాలని అంబటి ఎద్దేవా చేశారు. 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ మానిఫెస్టోలో ప్రకటించిన విషయాలను బీజేపీ మర్చిపోయిందా? లేదా మరోసారి కొత్తగా పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ మరచిపోయిందా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ ఎన్నికల మానిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారనీ కానీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. కానీ బీజేపీ ఇచ్చిన వాగ్ధానాన్ని తమ ప్రభుత్వం అమలు చేస్తోందనీ..గతంలో ఇచ్చిన మాటలను బీజేపీ మరచిపోయినా తాము మాత్రం ఇచ్చిన మాటపై నిలబడి అమలు చేస్తున్నామని తెలిపారు. బీజేపీకి నైతికత లేదా? అని ప్రశ్నించారు. ఇలా మేనిఫెస్టోలో ఏపీకి బీజేపీ ఇచ్చిన అన్ని వాగ్ధానాలకు మరచిపోయిందనీ..కానీ తాము మాత్రం అన్నింటికి కట్టుబడి అభివృద్ది దిశగా అడుగులు వేస్తుంటే విమర్శలు చేయటం తగదని అంబటి రాంబాబు మండిపడ్డారు.