పార్టనర్ యాక్టర్ నామినేషన్ వేస్తే వచ్చేది టీడీపీ కార్యకర్తలే

చంద్రబాబు, తన పార్టనర్ యాక్టర్ తో పొత్తు పెట్టుకున్నామని చెప్పుకోలేని పరిస్ధితిలో ఉన్నాడని వైసీపీ అధినేత జగన్ అన్నారు.

  • Published By: chvmurthy ,Published On : March 27, 2019 / 11:44 AM IST
పార్టనర్ యాక్టర్ నామినేషన్ వేస్తే వచ్చేది టీడీపీ కార్యకర్తలే

Updated On : March 27, 2019 / 11:44 AM IST

చంద్రబాబు, తన పార్టనర్ యాక్టర్ తో పొత్తు పెట్టుకున్నామని చెప్పుకోలేని పరిస్ధితిలో ఉన్నాడని వైసీపీ అధినేత జగన్ అన్నారు.

కాకినాడ: చంద్రబాబు, తన పార్టనర్ యాక్టర్ తో పొత్తు పెట్టుకున్నామని చెప్పుకోలేని పరిస్ధితిలో ఉన్నాడని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలోమాట్లాడుతూ ఆయన ..బాబు పార్టనర్ యాక్టర్ నామినేషన్ వేయటానికి వెళితే వచ్చేది టీడీపీ కార్యకర్తలే అని తెలిపారు. ఆయన పార్టనర్ చంద్రబాబుతో 4 ఏళ్ళు కాపురం చేస్తాడు, ఆఖరు సంవత్సరం విడిపోయినట్లు నటిస్తాడు.

చంద్రబాబు పై వ్యతిరేకంగా తాను  పోరాటం చేస్తే, తనపై గత 5 ఏళ్లలో 22 కేసులు పెట్టారని జగన్ వివరించారు. ఆఖరు సంవత్సరంలో చంద్రబాబు పార్టనర్  పోరాటాలుచేస్తే ఒక్క కేసు కూడా పెట్టడని….వీళ్ల డ్రామాలు ఒక్కసారి గమనించాలని జగన్ ఓటర్లను కోరారు.   ముమ్మిడి వరంలో బహిరంగ సభ జరుగుతున్నంత సేపు  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు  ప్రసావించవల్సి వచ్చినప్పుడల్లా, ఆ పేరు ఉఛ్చరించకుండా  జగన్ మోహన్ రెడ్డి పార్టనర్ యాక్టర్ అంటూ సంబోధించారు.
Read Also : జగన్ సభలో కూలిన ఇంటి స్లాబ్ : 30 మందికి గాయాలు

రాష్ట్రంలో 5 ఏళ్లుగా రాక్షసపాలన కొనసాగిందని జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. పురాణాల్లో రావణాసురుడికి 10 తలలు ఉంటే టీడీపీ అధినేత నారాసురుడు చంద్రబాబు నాయుడుకు 10 తలలు విడివిడిగా ఉంటాయని అన్నారు. ఒకటి ఆయన తలమీద ఉంటే, ఇంకోకటి పెయిడ్ యాక్టర్ పార్టనర్ దగ్గర ఉంటుంది. ఇంకో తల  రాజగురువు రూపంలో ఈనాడు అధిపతి దగ్గర ఉంటుందని అన్నారు. ” చంద్రబాబు నాయుడు గారి తోకపత్రిక రూపంలో ఇంకో తల ఉంటుంది, ఎల్లో మీడియా రూపంలో ఇంకో తల ఉంటుందని, రాజ్యాంగ వ్యవస్ధలో తన మనుషులను నింపిన చోట మరో తల,  దొంగ పార్టీలు , దొంగ విశ్లేషకుల రూపంలో మరో తల ఉంటుంది .

ఇవన్నీ  సరిపోనవట్లు అప్పుడప్పుడు ఢిల్లీ నుంచి నాయకులను తీసుకువచ్చి వేషాలు వేయిస్తుంటాడని ఆరోపించారు. వీరందరిదీ ఒకటే లక్ష్యం. నిజాల మీద చర్చ జరగకూడదని, చంద్రబాబు వాగ్దానాల మీద జరుగ కూడదు”. చంద్రబాబు నాయుడు దుష్ట పరిపాలన మీద చర్చ జరిగితే ఆయనకు డిపాజిట్లు కూడా రావని జగన్ వివరించారు. చంద్రబాబు నాయుడు పార్టనర్ యాక్టర్, ఎల్లో మీడియా  రోజుకో పుకారు పుట్టించి,దాని మీద చర్చలు జరుపుతారు.. తప్ప ఆయన పాలనపై చర్చ జరపవని ఆరోపించారు. ఈ ఎన్నికలు20 రోజులు ప్రజలను మభ్యపెట్టటానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.
Read Also : విధుల్లో ఉన్న వారికి ఓటు వేసే ఛాన్స్ : ఈసీ రజత్ కుమార్