దిశ ఘటనపై పవన్ ఆవేదన : ఆడబిడ్డలను రక్షించలేని అధికారాలు ఎందుకు?

తిరుపతిలో కార్యకర్తలను ఉద్ధేశించి ప్రసంగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో దిశ హత్యాచార ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆడవాళ్లపై అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. అమ్మాయిలు అన్యాయాల్ని ఎదుర్కోవాలని.. అటువంటి ధైర్యాన్ని అలవరచుకోవాలని పవన్ పిలుపునిచ్చారు.
ఆడవాళ్లపై చేయి వేస్తే చంపేస్తారనే భయం కలగాలన్నారు. అటువంటి శిక్షలు చట్టం ద్వారా అమలు చేయాలన్నారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసినవారిని శిక్షించని అధికారాలు ఎందుకు అని పవన్ ప్రశ్నించారు. ఆడపిల్లలపై రేపులకు పాల్పడేవారిని తోలు ఊడే వరకూ కొట్టాలని వపన్ అన్నారు.
దేవతల చేతుల్లో ఉండే ఆయుధాలు.. తప్పు చేసిన వారిని శిక్షించేందుకే అనే విషయాన్ని తెలియజేయటానికేనని అన్నారు. తమపై అన్యాయం చేయాలనుకునేవారి విషయంలో ఆడపిల్లలు ఆది పరాశక్తుల్లా వ్యవహరించాలని పవన్ పిలుపునిచ్చారు.