మోడల్ బాగా నచ్చింది : బతికుండగానే సమాధులు కట్టుకున్న దంపతులు

తెలంగాణాలోని కామారెడ్డి జిల్లాలో ఓ వృద్ధ దంపతులు తాము బ్రతికి ఉండగానే వారికివారే సమాధులు కట్టించుకున్నారు. తమ విగ్రహాలు కూడా తయారు చేయించుుని పెట్టేసుకున్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం డోంగ్లీ గ్రామంలో నివసిస్తున్న సోపాన్, అంజనీ బాయి దంపతులకు నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లకు..నలుగురు కొడుకులకు కూడా పెళ్లిళ్లు చేసేశారు.
పిల్లలందరికీ అందరికీ పెళ్లిళ్లు చేశారు. ఆస్తులు కూడా పంచి ఇచ్చేశారు. ఎవరికి వారు వేరు కాపురాలు పెట్టుకుని బతుకుతున్నారు. ఇంతలో ఆ దంపతులు, కొడుకులను షాక్ ఇస్తూ…గ్రామ శివారులో రూ.లక్షతో వంద గజాల స్థలాన్ని కొని, ఆ స్థలంలో తమ సమాధులను కట్టించుకున్నారు.
భార్యా భర్తా సమాధుల్ని వేరు వేరుగా కట్టించుకున్నారు.
అంతేకాదు..గ్రామంలో హనుమాన్ మందిర నిర్మాణం కోసం వచ్చిన కళాకారులతో విగ్రహాలను తమ ఇద్దరి విగ్రహాలు తయారు చేయించుకున్నారు. అలా తయారు చేయించున్న తమ విగ్రహాలను సమాధులపై ప్రతిష్టించుకున్నారు. విగ్రహాల తయారీకి..సమాధులు కట్టించటానికి అన్నింటికీ కలిపి రూ.2.5 లక్షలు వరకూ ఖర్చు పెట్టారు.
ఈ విషయం తెలిసిన కొడుకులు, కూతుళ్లు తల్లిదండ్రుల్ని నిలదీశారు. తల్లిండ్రుల్ని పట్టించుకోవట్లేదని వారిని సరిగా చూసుకోవట్లేదేమో రేపు వాళ్లు చనిపోయాక సమాధులు కట్టిస్తోరో లేదోనని వాళ్లకు వాళ్లే ఇలా చేశారని మా గురించి అందరూ అపార్థం చేసుకోరా? చెడుగా మాట్లాడుకోరా? అని ప్రశ్నించారు. అలాగే గ్రామస్తులు కూడా అదే అనుకున్నారు. బతికుండగానే ఇదేంపని అని అనుకున్నారు.
దాని ఆ ముసలి దంపతులు మాట్లాడుతూ..ఎవర్నీ నొప్పించడానికి ఈ పని చేయలేదని..తమ ఆత్మసంతృప్తి కోసం ఈ పని చేశామని..కొడుకులు తమకోసం చేస్తారు.. కానీ తమ సమాధుల్ని తాము కోరినట్లుగా తమ కొడుకులు నిర్మిస్తారో లేదోననే తామే ఆ పని చేయించుకున్నామని గ్రామస్తులకు కూడా చెప్పారు.
వారు ఆ నిర్ణయం తీసుకోవాటానికి గల మరో కారణం గురించి చెబుతూ..సోపాన్ దంపతులు ఓ రోజు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కాలా గ్రామంలో జరిగిన పెళ్లికి వెళ్లారు. అక్కడ ఊరి చివర్లో నిర్మించిన సమాధుల్ని చూసి ఆశ్చర్యపోయారు. అవి వారికి బాగా నచ్చాయి. తాము కూడా ఆ మోడల్ సమాధుల్ని నిర్మించుకుంటే ఎలా ఉంటుందని అనుకున్నారు. అలా తమ ఆలోచనలకు బతికుండగానే రూపునిచ్చుకున్నామని..అంతే తప్ప వేరే ఏ ఉద్ధేశంతోను చేయలేదని సోపాన్, అంజనీ బాయి తెలిపారు.