ఏనుగు కాలు కాదు : వింత వ్యాధితో నరకం చూస్తున్నాడు
బాల్యమంటే అందరికీ అమితమైన ఇష్టమే. చిన్ననాటి మధుర స్మృతులు మరిచిపోలేనివి. కానీ, ఓ కుర్రాడి బాల్యాన్ని వింత వ్యాధి నరకంగా మార్చింది.

బాల్యమంటే అందరికీ అమితమైన ఇష్టమే. చిన్ననాటి మధుర స్మృతులు మరిచిపోలేనివి. కానీ, ఓ కుర్రాడి బాల్యాన్ని వింత వ్యాధి నరకంగా మార్చింది.
బాల్యమంటే అందరికీ అమితమైన ఇష్టమే. చిన్ననాటి మధుర స్మృతులు మరిచిపోలేనివి. కానీ, ఓ కుర్రాడి బాల్యాన్ని వింత వ్యాధి నరకంగా మార్చింది. తోటి వారంతా ఆడుకుంటుంటే తాను మాత్రం అంతు చిక్కని వ్యాధితో మంచానికే పరిమితం అయ్యాడు. 20 ఏళ్ల వయసొచ్చినా ఒంటరిగా ఎక్కడికీ కదల్లేని పరిస్థితి వచ్చింది.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం వెంకట్రావ్‌పల్లికి చెందిన రాజుకు చిన్నతనంలోనే వింత వ్యాధి సోకింది. పుట్టగానే కుడి కాలికి పోలియో వచ్చింది. దాన్ని అధిగమించేందుకు నానా అవస్థలు పడుతున్న సమయంలోనే ఓ మాయదారి వ్యాధి అటాక్ చేసింది. రాజు వయసుతో పాటే.. కాలు సైజు కూడా పెరుగుతూ వస్తోంది. వైద్యం కోసం తిరగని ఆస్పత్రి లేదు, చూపించని డాక్టర్ లేడు. అసలు ఈ వ్యాధికి కారణాలేంటి, కాలు ఎందుకు పెరుగుతోందన్నది ఏ డాక్టర్ కూడా నిర్ధారించలేక పోయారు.
హైదరాబాద్ ఉస్మానియాలో 2006లో రాజు కాలుకి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ సమయంలో రక్తం ఎక్కువగా కారడంతో డాక్టర్లు ఆపరేషన్‌ను మధ్యలోనే ఆపేశారు. చికిత్స కొనసాగిస్తే ప్రాణానికే ప్రమాదమని తెలియడంతో ఇంటికి పంపించారు. రాజు వయసు రెండు పదులు దాటినా.. తల్లే అన్నీ చేయాల్సిన పరిస్థితి. తండ్రి సాయం లేనిదే కదల్లేని దుస్థితి. కాలి బరువు రోజురోజుకు పెరిగిపోతుండడంతో.. భారాన్ని మోయలేకపోతున్నానని రాజు వాపోతున్నాడు. దాతలెవరైనా ఆపరేషన్ చేయించాలని వేడుకుంటున్నాడు. అవసరమైతే కాలు తీసేసినా మంచిదే అంటూ విలపిస్తున్నాడు.
రాజు వయసు పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రుల్లో మానసిక వేదన కూడా పెరుగుతోంది. శక్తి ఉన్నంత కాలం రాజుని కాపాడుకుంటామని, ఆ తరువాత పరిస్ధితి ఏంటని తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నారు. రాజుని ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నా కష్టమే. హుజురాబాద్ నుండి ప్రత్యేక వాహనంలో కరీంనగర్ లేదా హైదరాబాద్ తీసుకురావాల్సిన పరిస్థితి. దీంతో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతోంది ఈ కుటుంబం. రాజు పడుతున్న బాధ చూసి.. ఎవరైనా వైద్య సాయం అందించాలని వేడుకుంటున్నారు.