చలో కొమురవెల్లి : కొమురవెల్లికి ఎలా వెళ్లాలి

  • Published By: madhu ,Published On : January 20, 2019 / 06:05 AM IST
చలో కొమురవెల్లి : కొమురవెల్లికి ఎలా వెళ్లాలి

Updated On : January 20, 2019 / 6:05 AM IST

సిద్ధిపేట : చేర్యాలలోని కొమురవెల్లి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి. వివిధ జిల్లాల నుండి భక్తులు చలో కొమురవెల్లి అంటున్నారు. భారీగా భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. దీనితో అక్కడి ప్రాంతమంతా సందడి సందడిగా మారిపోయింది. అయితే కొంతమందికి కొమురవెల్లికి ఎలా చేరుకోవాలో తెలియదు. 
కొమురవెల్లి మల్లన్న హైదరాబాద్ నుండి 90 కిలోమీటర్లు, వరంగల్ నుండి 110 కిలో మీటర్లు, కరీనంగర్ నుండి 70 కిలో మీటర్లు, సిద్ధిపేట నుండి 24 కిలోమీటర్లు, జనగామ నుండి 45 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. హైదరాబాద్, కరీనంగర్, సిద్ధిపేట తదితర జిల్లాలకు చెందిన భక్తులు రాజీవ్ రహదారి గుండా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కొమురవెల్లి, ఐనాపూర్ స్వాగత తోరణాల వద్ద దిగాలి. ఇక్కడి నుండి ఆటోలు, ప్రైవేటు వాహనాలు ఆలయం వద్దకు తీసుకెళుతున్నాయి. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడుపుతోంది. ఒకవేళ రైలులో వెళ్లాలని అనుకొంటే…సికింద్రబాద్ రైల్వే స్టేషన్ నుండి జనగామ స్టేషన్‌కు చేరుకోవాలి. ఇక్కడి నుండి జనగామ ఆర్టీసీ బస్సు ద్వారా కొమురవెల్లికి వచ్చేందుకు ప్రత్యేక బస్సు సౌకర్యం ఉంది.