ఓటరు జాబితాలో మీ పేరు లేదా.. దరఖాస్తుకు 3 రోజులే

నాయకులు సీట్ల కోసం కుస్తీ పడుతుంటే… సామాన్యులు మాత్రం ఓట్లు ఎక్కడున్నాయో వెతుక్కునే పనిలో పడ్డారు. మరి మీ ఓటు ఎక్కడ ఉందో చూసుకున్నారా? ఓటరు జాబితాలో మీ పేరు, ఇతర వివరాలన్నీ సరిగ్గానే ఉన్నాయా? ఓటరు జాబితాలో మీ పేరు లేకపోతే ఏం చేయాలో అర్థం కావట్లేదా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోండి. అసలు ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో ముందుగా తెలుసుకోవాలి.
Read Also : ఎన్నికల యుద్ధానికి మహిళా పార్టీ రెడీ: 9 స్థానాల్లో పోటీ
ఓటరు జాబితాలో మీ పేరు లేకపోతే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ఫామ్-6 పూర్తి చేసి అప్లై చేయాలి. మార్చి 15 ఓటు నమోదుకు చివరి తేదీ. మీరు అంతలోపే ఓటుకు నమోదు చేసుకుంటే ఏప్రిల్ 11న తెలుగు రాష్ట్రాల్లో జరిగే లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. లేదంటే ఈసారి ఇక మీకు ఓటు లేనట్టే. అందుకే మార్చి 15 లోగా ఫామ్-6తో దరఖాస్తు చేయాలి.
* ఓటు దరఖాస్తుకు కావలసినవి:
మీ ఏజ్ ప్రూఫ్, అడ్రస్, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు ఉంటే చాలు. ఆన్‌లైన్‌లో లేదా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తును చేసుకోవచ్చు.