బొజ్జ గణపయ్యకు బోల్డన్ని పేర్లు : వాటి అర్థాలు ఇవే 

  • Published By: veegamteam ,Published On : August 29, 2019 / 07:50 AM IST
బొజ్జ గణపయ్యకు బోల్డన్ని పేర్లు : వాటి అర్థాలు ఇవే 

Updated On : August 29, 2019 / 7:50 AM IST

వినాయకుడు.. గణేషుడు.. విఘ్నేశ్వరుడు.. ఏకదంతుడు.. లంబోదరుడు.. ఇలా విఘ్నాలను తొలగించే వినాయకుడికి ఎన్నో పేర్లున్నాయి. ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు. భక్తుల మొరను ఆలకిస్తాడు. భక్తులు భక్తితో చేసే పూజల్ని వీక్షిస్తాడు. ఏ పేరుతో పిలిచినా పలికే వినాయకుడికి భిన్నమైన పేర్లు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. ఆ పేర్లేమిటో.. వాటి అర్థాలను ఈ వినాయక చవితి సందర్బంగా తెలుసుకుందాం..

1. ఏకదంతుడు అంటే ఏక అంటే ఒక్కటి. ఒక్కటే దంతం ఉన్నవాడు అని అర్థం
2. లంబోదర (కుండలాంటి పొట్ట కలవాడు)
3. విఘ్ననాశ లేదా విఘ్నేశ్వరుడు (పనుల్లో అవరోధాలు అంటే విఘ్నాలను తొలగించే వాడు లేదా ఆటంకాలు ఏర్పడకుండా చూసేవాడు)
4. వినాయక (అన్ని నాయకత్వ లక్షణాలున్న నాయకుడు అంటే గణాలకు నాయకత్వం వహించేవాడు)
5. గణనాథుడు (అన్ని గణాలకు అధిపతి)
6. గజాననుడు (ఏనుగు లాంటి ముఖం కలవాడు)
7. ఓంకారుడు (సరైన జీవితాన్ని ఇచ్చేవాడు)
9. అద్వైత (ఏకైక వ్యక్తిత్వం ఉన్నవాడు)
10. అవనీషుడు (ప్రపంచాన్ని ఏలే వాడు)

ఇవకాక బొజ్జగణపయ్యకు ఉన్న బోల్డన్ని పేర్లు ఇవే..
1. బాల గణపతి
2. భక్తి గణపతి
3. ధుంధి గణపతి
4. దుర్గా గణపతి
5. ద్విజ గణపతి
6. ద్విముఖ గణపతి
7. ఏకదంత గణపతి
8. ఏకాక్షర గణపతి
9. హరిద్ర గణపతి
10. హీరాంబ గణపతి
11. క్షిప్ర గణపతి
12. క్షిప్ర ప్రసాద గణపతి
13. లక్ష్మీ గణపతి
14. మహా గణపతి
15. నృత్య గణపతి
16. రుణమోచన గణపతి
17. సంకటహర గణపతి
18. శక్తి గణపతి
19. సిద్ధి గణపతి
20. సింహ గణపతి
21. సృష్టి గణపతి
22. తరుణ గణపతి
23. త్రిముఖ గణపతి
24. త్య్రక్షర గణపతి
25. ఉచ్ఛిష్ట గణపతి
26. ఉద్దండ గణపతి
27. ఊర్ధ గణపతి
28. వరద గణపతి
29. విఘ్న గణపతి
30. విజయ గణపతి
31. వీర గణపతి
32. యోగ గణపతి

వినాయకుణ్ని ఎన్ని పేర్లతో పిలిచినా.. కొలిచినా.. భక్తులు వినతులను మన్నిస్తాడు భక్తి గణపతి. కొంచెం ప్రసాదం పెట్టి ప్రసన్నం చేసుకుంటే వరాలను ప్రసాదిస్తాడు వర గణపతి. ఈ వినాయక చవితి పండుగ పర్వదినాన గణేషుడికి ఉండే పేర్లను తెలుసుకుని భక్తులు కోరికల్ని నెరవేరుస్తాడు బొజ్జగణపయ్య.