Earthquake : వామ్మో.. ఆ ప్రాంతంలో మరోసారి భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు.. సముద్రం అల్లకల్లోలం..

Earthquake : భూకంపం కారణంగా పలు ప్రాంతాల్లో భవనాలు దెబ్బతినగా.. కొన్ని భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. భూ ప్రకంపనల సమయంలో ప్రజలు భయంతో ..

Earthquake : వామ్మో.. ఆ ప్రాంతంలో మరోసారి భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు.. సముద్రం అల్లకల్లోలం..

Earthquake

Updated On : October 5, 2025 / 8:32 AM IST

Earthquake : జపాన్ ప్రజలను మరోసారి భారీ భూకంపం వణికించింది. శనివారం రాత్రి సమయంలో హోన్షు తూర్పు తీరానికి సమీపంలో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) పేర్కొంది. ఈ భూకంపం 10కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు వెల్లడించింది. రాజధాని టోక్యోకు ఈశాన్యదిశగా 258 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంటుంది.

భూకంపం కారణంగా పలు ప్రాంతాల్లో భవనాలు దెబ్బతినగా.. కొన్ని భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. భూ ప్రకంపనల సమయంలో ప్రజలు భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తీర ప్రాంతం కావడంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో సునామీ ముంచుకొస్తుందని స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే, అధికారులు సునామీ హెచ్చరికలు ఏమీ లేవని తేల్చడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

జపాన్ భౌగోళికంగా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌ పరిధిలో క్రియాశీలక అగ్నిపర్వత జోన్‌లో కొనసాగుతోంది. ఈ కారణంగా ప్రపంచంలోనే అత్యధిక భూకంప నెట్‌వర్క్‌లో ఉన్నందున ఇక్కడ తరుచుగా భూ ప్రకంపనలు చోటుచేసుకుంటుంటాయి. సునామీలు కూడా సంభవించే అవకాశాలు ఈ ప్రాంతంలో ఎక్కువ. ఇప్పటి వరకు సంభవించిన ప్రధాన భూకంపాల్లో 2024లో నోటో భూకంపం, 2011 తోహాకు భూకంపం, సునామీ, 2004 చుయెట్సు భూకంపం, 1995లో సంభవించిన గ్రేట్ హాన్షిన్ భూకంపం ఉన్నాయి.

జపాన్ లో భూకంప తీవ్రతను లెక్కించడానికి షిండో స్కేల్ ను ఉపయోగిస్తారు. ఇది అమెరికాలో ఉపయోగించే మోడిఫైడ్ మెర్కల్లీ ఇంటెన్సిటీ స్కేల్. భూకంపం విడుదల చేసే మాగ్నిట్యూడ్ ను రిక్టర్ స్కేల్ కొలుస్తుంది. షిండో స్కేల్ ప్రకారం.. నాలుగు లేదా అంతకంటే తక్కువ తీవ్రత ఉన్న భూకంపాలను తేలికపాటివిగా పరిగణిస్తారు. ఐదు లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న ప్రకంపనలు తీవ్రమైనవిగా భావిస్తారు.