ఇంగ్లీష్ పాలెంలో బాంబుల కలకలం 

  • Published By: veegamteam ,Published On : March 20, 2019 / 06:42 AM IST
ఇంగ్లీష్ పాలెంలో బాంబుల కలకలం 

Updated On : March 20, 2019 / 6:42 AM IST

మచిలీపట్నం : ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నవేళ బైటపడిన బాంబులు కలకలం సృష్టిస్తున్నాయి. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం మండలం ఇంగ్లీష్ పాలెంలో బాంబులను దాచినట్లు పోలీసులకు సమాచారం అందటంతో రంగంలోకి దిగారు. దీంట్లో భాగంగా ఓ ఇంట్లో తనిఖీలు నిర్వహించగా..బాంబులను స్వాధీనం చేసుకున్నారు.

దీనికి సంబంధించినవారుగా భావిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని పై అధికారులకు తెలిపామనీ..విచారణ కొనసాగిస్తున్నామని..ఈ బాంబులను ఎవరు తెచ్చారు? ఎవరిని టార్గెట్ చేసి ఈ బాంబులను దాచారు అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు.  
Read Also :భారీ తిమింగలం మృతి..కడుపులో 40 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు