మత్తులో మైనర్లు..పోలీసుల అదుపులో 20 మంది అమ్మాయిలు..10మంది అబ్బాయిలు

యువత మత్తులో చిత్తవుతున్నారు..ఒక పక్క కరోనా విజృంభిస్తుంటే మరోపక్క యువత మత్తుకు బానిసలవుతున్నారు. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఆన్‌లాక్ మొదలైందో లేదో..డ్రగ్ మాఫియా రెచ్చిపోతోంది. యువతను టార్గెట్ గా చేసుకుని వారిని మత్తులో ముంచెత్తుతోంది. బార్లు, హుక్కాసెంటర్లు తెరుచుకోవడంతో విచ్చలవిడిగా యువత రెచ్చిపోతున్నారు. దీనికి తోడు మాదకద్రవ్యాలు తీసుకుంటూ కొంత మంది మైనర్లు పోలీసులకు చిక్కారు. దీంట్లో 20 మంది బాలికలు, 10 మంది బాలురు ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని టిటినగర్ ప్రాంతంలో ఉన్న హక్కాసెంటర్లో ఇది జరిగింది. ఇం
జోహ్రీ హోటల్‌లోని హుక్కా లాంజ్‌లో కొంత మంది మైనర్లు పార్టీ నిర్వహిస్తున్నారనే సమాచారం పోలీసులకు చేరింది. స్పెషల్ టీం పోలీసులు వెంటనే హుక్కా లాంజ్ పై దాడులు నిర్వహించారు..అప్పటికే వారంతా మద్యం, మాదక ద్రవ్యాల మత్తులో తూగుతున్నారు. ఈ మైనర్లందరూ పుట్టినరోజు పార్టీ పేరుతో పార్టీ చేసుకుని మాదకద్రవ్యాలు తీసుకుంటున్నారని తెలిపారు.
https://10tv.in/chandrababu-naidu-gives-bumper-offer-to-achennayudu-as-ap-tdp-president/
సెంటర్ నిర్వాహకులే వారికి పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా అందుబాటులో ఉంచి వారిని మత్తులో ముంచుతున్నారని పోలీసులు తెలిపారు. వారందరిని అదుపులోకి తీసుకుని స్పెషల్ జువెనైల్ పోలీసులకు అప్పగించారు. హోటల్ నిర్వాహకులు పరారీలో ఉండటంతో వారి కోసం గాలిస్తున్నారు.