కాంగ్రెస్‌తో టచ్‌లో లేను : మహబూబ్‌నగర్ సీటు నాదే

కాంగ్రెస్ తో తాను టచ్ లో లేనని టీఆర్ఎస్ నేత, ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు తాన వ్యతిరేకం అని, ఆ పార్టీతో పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. నేనంటే పడని వారే

  • Published By: veegamteam ,Published On : March 14, 2019 / 10:51 AM IST
కాంగ్రెస్‌తో టచ్‌లో లేను : మహబూబ్‌నగర్ సీటు నాదే

కాంగ్రెస్ తో తాను టచ్ లో లేనని టీఆర్ఎస్ నేత, ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు తాన వ్యతిరేకం అని, ఆ పార్టీతో పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. నేనంటే పడని వారే

కాంగ్రెస్ తో తాను టచ్ లో లేనని టీఆర్ఎస్ నేత, ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు తాన వ్యతిరేకం అని, ఆ పార్టీతో పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. నేనంటే పడని వారే ఎంపీ సీటు  రాదని ప్రచారం చేస్తున్నారని జితేందర్ రెడ్డి ఆరోపించారు. మహబూబ్ నగర్ టికెట్ తనకే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ పై తనకు పూర్తి నమ్మకం ఉందని జితేందర్  రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేశానని జితేందర్ రెడ్డి తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని ఎంపీ జితేందర్ రెడ్డి జోస్యం చెప్పారు.
Read Also : ’జనసేన’కు యర్రా నవీన్ గుడ్ బై

పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన ముగ్గురికి తప్పితే… మిగతా సిట్టింగ్ ఎంపీలందరికీ టికెట్లు గ్యారంటీ అని కొన్ని రోజుల క్రితం పార్టీ సమావేశంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అప్పటి నుంచి ఆ ముగ్గురు ఎవరనే దానిపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కేసీఆర్ టికెట్ నిరాకరించబోయే వారి జాబితాలో మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి ఉన్నారనే వార్తలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు జితేందర్ రెడ్డి ప్రయత్నించారనే ప్రచారం జరిగింది. దీనికి తోడు పార్టీ ఎమ్మెల్యేల గెలుపు కోసం జితేందర్ రెడ్డి కృషి చేయలేదనే అపవాదు ఉంది. దీంతో ఆయనకు మరోసారి టీఆర్ఎస్ టికెట్ ఇచ్చే అవకాశం లేదనే వార్తలు వినిపించాయి. దీనిపై స్పందించిన జితేందర్ రెడ్డి… అవన్నీ ఊహాగానాలే అని స్పష్టం చేశారు.

ఇప్పటివరకు టీఆర్ఎస్ నుంచి ఎంపీలగా ఖరారైన వారిలో బోయినపల్లి వినోద్‌కుమార్‌ (కరీంనగర్‌), కల్వకుంట్ల కవిత (నిజామాబాద్‌), కొత్త ప్రభాకర్‌రెడ్డి (మెదక్‌), బూర నర్సయ్యగౌడ్‌ (భువ నగిరి), జి.నగేశ్‌ (ఆదిలాబాద్‌)ల పేర్లు ఉన్నాయి. మహబూబ్‌ నగర్‌, ఖమ్మం జిల్లాల్లో ప్రాజెక్టులపై సీఎం జరిపిన సమీక్షలకు ఆ జిల్లా ఎంపీలు జితేందర్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు సమాచారం ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. వీరిద్దరితో పాటు మహబూబాబాద్‌ ఎంపీ సీతారాం నాయక్‌ కు కూడా ఈసారి టికెట్‌ వచ్చే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది.
Read Also : కాంగ్రెస్‌కు మరో షాక్: టీఆర్ఎస్‌లోకి పాలేరు ఎమ్మెల్యే