CM జగన్ భార్యని కలిసిన హీరో మహేష్‌ బాబు భార్య నమ్రత 

  • Published By: veegamteam ,Published On : October 25, 2019 / 09:31 AM IST
CM జగన్ భార్యని కలిసిన హీరో మహేష్‌ బాబు భార్య నమ్రత 

Updated On : October 25, 2019 / 9:31 AM IST

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య భారతిని హీరో మహేశ్ బాబు భార్య నమ్రత కలిశారు. ఏపీలోని గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని మహేశ్ బాబు దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుర్రిపాలెం గ్రామానికి సంబంధించిన వివరాలను వైఎస్ భారతికి నమ్రత వివరించారు. బుర్రిపాలెం అభివృద్ధికి ప్రభుత్వం సహాకారం అందించాలని భారతిని నమ్రత కోరారు. 

హీరో  మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ స్వగ్రామం బుర్రిపాలెం అనేవిషయం తెలిసిందే.బుర్రిపాలెం అభివృద్ధి పనులను మహేశ్ బాబు భార్య నమ్రత పర్యవేక్షిస్తున్నారు.ఈక్రమంలో బుర్రిపాలెం అభివృద్దికి సహకారం అందించాలని నమ్రత సీఎం భార్య భారతిని కోరారు. కాగా మహేశ్ బాబు తెలంగాణలోని  మహబూబ్‌నగర్ జిల్లా, కొత్తూరు మండలంలోని సిద్ధాపురం గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.

అలాగే  నమ్రత విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనం అనంతరం నమ్రత వేద పండితులు ఆశీర్వచనం అందుకున్నారు. అర్చకులు నమ్రతకు అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు.