ఇదేం వింతరా బాబూ : పాలు ఇస్తున్న మేకపోతు..

  • Published By: nagamani ,Published On : July 29, 2020 / 03:12 PM IST
ఇదేం వింతరా బాబూ :  పాలు ఇస్తున్న మేకపోతు..

Updated On : July 29, 2020 / 3:48 PM IST

ఆడ జంతువులే పాలు ఇస్తుంటాయి. ఆవులు..గేదెలు పాలు ఇస్తుంటాయి. కానీ మేకల జాతి అయినా ఆడ మేకలే పాలు ఇస్తుంటాయి. ఇది ప్రకృతి ధర్మంగా జరుగుతుంటుంది. కానీ రాజస్థాన్ లో మాత్రం ఓ మగ మేక అంటే మేకపోతు పాలు ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.



రాజస్థాన్‌లో ప్రకృతికి విరుద్ధంగా ఓ మేకపోతు పాలిస్తోంది. ప్రతి రోజూ 250 గ్రాముల పాలు ఇస్తోందని ఆ మేకపోతు యజమాని చెబుతున్నాడు. ఇది విన్న జనం అంతా విస్తుపోతున్నారు. ఇది కచ్ఛితంగా వింతేమరి. వింతను కళ్లారా చూడాలని ప్రజలు ఉత్సాహపడుతుంటారు. అలాగే పాలు ఇచ్చే ఈ మేకపోతును చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనాలు భారీగాతరలి వచ్చి దాన్ని వింతగా విచిత్రంగా చూస్తున్నారు. ఇదేం వింతరా బాబూ అంటూ ముక్కున వేలేసుకుని కొంతమంది..బుగ్గన వేలేసుకుని ఇంకొంతమంది కళ్లార్పకుండా చూస్తున్నారు ఈ పాలు ఇచ్చే మేకపోతు వంక.



ధోల్పూర్‌ జిల్లాలోని గుర్జా గ్రామానికి చెందిన రాజీవ్‌ కుష్వాహా రెండు నెలల వయసున్న సమయంలో ఏ మగ మేకను మార్కెంట్ నుంచి కొనుక్కొచ్చాడు. అలా దాన్ని చక్కగా మేపుతున్నాడు. అలా ఆరు నెలల తర్వాత ఆ మగమేకలో పొదుగు పెరగడంతో అతడు ఆశ్చర్యపోయాడు. పితికి చూడగా దాని నుంచి పాలు కూడా రావటంతో మరింతగా ఆశ్చర్యపోయాడు. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పగా వాళ్లుకూడా తెగ ఆశ్చర్యపోయారు.



దీంతో ఆయజమాని ఆ మగమేకను పశువైద్య అధికారులకు చూపించాడు. దానికి పరీక్షలు చేసిన డాక్టర్లు హార్మోన్లలో తేడా ఉండటం వల్ల ఇలా జరిగిందని వెల్లడించారు. మగ మేకలో ఆడమేక హార్మోన్లు కూడా ఉన్నాయని..అందుకే ఆ మడమేక పొదుడులోంచి పాలు రావటానికి కారణమని చెప్పారు.ఇలా ఒక మగ మేక పాలివ్వడం తొలిసారి చూస్తున్నామని స్థానికులతో పాటు దాన్ని చూడటానికి వచ్చినవారు కూడా చెబుతున్నారు. ఈ వింత ఆ నోటా.. ఈ నోటా వైరల్ గా మారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.