రిలీఫ్ : సచివాలయ పరీక్షలు రాసిన అభ్యర్థులకు మార్కులు

సచివాలయ పరీక్షలు రాసిన అభ్యర్థులకు అధికారులు మార్కులు ఇచ్చారు. అభ్యర్థులందరికి 2 మార్కులు కలిపారు. ప్రశ్నల్లో తప్పులు ఉండటంతో అధికారులు ఈ నిర్ణయం

  • Published By: veegamteam ,Published On : September 8, 2019 / 03:27 AM IST
రిలీఫ్ : సచివాలయ పరీక్షలు రాసిన అభ్యర్థులకు మార్కులు

Updated On : September 8, 2019 / 3:27 AM IST

సచివాలయ పరీక్షలు రాసిన అభ్యర్థులకు అధికారులు మార్కులు ఇచ్చారు. అభ్యర్థులందరికి 2 మార్కులు కలిపారు. ప్రశ్నల్లో తప్పులు ఉండటంతో అధికారులు ఈ నిర్ణయం

సచివాలయ పరీక్షలు రాసిన అభ్యర్థులకు అధికారులు మార్కులు ఇచ్చారు. అభ్యర్థులందరికి 2 మార్కులు కలిపారు. ప్రశ్నల్లో తప్పులు ఉండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 1 న కేటగిరి-1 ‘సచివాలయ’ ఉద్యోగాల రాతపరీక్ష జరిగింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులందరికీ 2 మార్కులు కలపాలని అధికారులు నిర్ణయించారు. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-5, మహిళా పోలీసు, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ.. ఇలా మొత్తం 4 రకాల పోస్టులకు కలిపి నిర్వహించిన ఒకే పరీక్షలో రెండు ప్రశ్నల్లో తప్పులు దొర్లాయి. వాటికి కేటాయించిన మార్కులను ఆ రోజు పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ కలపాలని నిర్ణయించారు.

4వేల 465 పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 11 లక్షల 62వేల 164 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించి ఫైనల్‌ ‘కీ’ని అధికారులు శనివారం(సెప్టెంబర్ 7,2019) విడుదల చేశారు. ఏ-సిరీస్‌ ప్రశ్నపత్రంలో 47, 98 ప్రశ్నలకు.. బీ-సిరీస్‌ ప్రశ్నపత్రంలో 30, 84 ప్రశ్నలకు.. సీ-సిరీస్‌ ప్రశ్నపత్రంలో 13, 147 ప్రశ్నలకు.. డీ-సిరీస్‌ ప్రశ్నపత్రంలో 3, 118 ప్రశ్నలకు పూర్తి మార్కులు కలుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇవి కాకుండా.. పరీక్ష జరిగిన రోజు ప్రకటించిన ప్రాథమిక ‘కీ’ పై అభ్యర్థుల నుంచి వినతులు రావడంతో అందులోని ఒక ప్రశ్నకు సంబంధించిన జవాబును కూడా ఫైనల్‌ ‘కీ’లో మార్చారు.

ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు శనివారం(సెప్టెంబర్ 7,2019) జరిగిన పరీక్షకు 86.63 శాతం మంది హాజరయ్యారు. గ్రామ, పట్టణ వార్డు సచివాలయాల్లో కలిపి 14వేల 759 ఉద్యోగాలకు 1,33,832 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు లక్ష 16వేల 208 మంది హాజరయ్యారు. అలాగే, సాయంత్రం 400 విలేజీ సెరికల్చర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు జరిగిన పరీక్షకు 5వేల 047 మందికి గాను 4,034 మంది హాజరయ్యారు. 

సెప్టెంబర్‌ 1న జరిగిన డిజిటల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల ప్రశ్నపత్రంలోనూ 2 ప్రశ్నల్లో తప్పులు వచ్చాయి. దీంతో ఆ పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ కూడా 2 మార్కులు కలపాలని అధికారులు నిర్ణయించారు. ఈ పరీక్ష ఫైనల్‌ ‘కీ’ని కూడా శనివారం(సెప్టెంబర్ 7,2019) రాత్రి ప్రకటించారు. ఎ-సిరీస్‌లో 57, 72 ప్రశ్నలకు.. బి-సిరీస్‌లో 56, 141, సి-సిరీస్‌లో 118, 133, డి-సిరీస్‌లో 77, 92 ప్రశ్నలకు పూర్తి మార్కులు కేటాయిస్తారు. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాల మేరకు ప్రాథమిక కీలో పేర్కొన్న 7 ప్రశ్నల సమాధానాలను ఫైనల్‌ కీలో మార్చారు. వీటిలో 5 ప్రశ్నలకు ఇచ్చిన జవాబుల్లో రెండేసి సమాధానాలున్నట్లు అధికారులు గుర్తించారు. అభ్యర్థులు ఈ రెండింటిలో ఏది జవాబుగా పేర్కొన్నా మార్కులివ్వనున్నట్లు ఫైనల్‌ ‘కీ’లో తెలిపారు.