అయ్యప్ప మాలధారణలో పూజలు ఎలా చేస్తారు : మంత్రిపై బౌద్ధుల ఆగ్రహం
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తీరుపై బౌద్ధ సంఘాలు మండిపడుతున్నాయి. విశాఖలోని తొట్లకొండపై మరమత్తుల పేరిట పూజలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తమ

ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తీరుపై బౌద్ధ సంఘాలు మండిపడుతున్నాయి. విశాఖలోని తొట్లకొండపై మరమత్తుల పేరిట పూజలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తమ
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తీరుపై బౌద్ధ సంఘాలు మండిపడుతున్నాయి. విశాఖలోని తొట్లకొండపై మరమత్తుల పేరిట పూజలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తమ సంప్రదాయాలను కించపరిచేలా పూజలు చేయడమేంటని బౌద్ధ సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. అయ్యప్పస్వామి మాలధారణలో.. బౌద్ధుల కొండపై పూజలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖలోని తొట్లకొండపై ఉన్న బౌద్ధక్షేత్రం… బౌద్ధుల ఆచారాలు, సంప్రదాయాలకు నెలవుగా పేరొందింది. ప్రపంచవ్యాప్తంగా ఈ బౌద్ధారామానికి ఎంతో ఖ్యాతి ఉంది. బౌద్ధుల జీవనానికి నిదర్శనంగా నిలిచే ఎన్నో ఆనవాళ్లు ఇక్కడున్నాయి. దీంతో విశాఖకు అత్యంత సమీపంలోనే ఉన్న ఈ తొట్లకొండ ప్రముఖ పర్యాటకంగా కేంద్రంగా కూడా విలసిల్లుతోంది.
అక్టోబర్ లో కురిసిన భారీ వర్షాలకు ఈ బౌద్ధారామం కూలిపోయింది. బౌద్ధ క్షేత్రం పూర్తిగా ధ్వంసమైంది. దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ బౌద్ధులు ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వం ఈ బౌద్ధక్షేత్రానికి మరమత్తులు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆ బౌద్ధక్షేత్రాన్ని సందర్శించారు. ప్రభుత్వం 43 లక్షల రూపాయలు కూడా కేటాయించడంతో నవంబర్ 25న మరమత్తు పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి అవంతి శ్రీనివాస్. ఇదే ఇపుడు వివాదాస్పదమవుతోంది.
సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించిన తర్వాత మంత్రి శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో ఆయన అక్కడే కాసేపు ధ్యానం కూడా చేశారు. అదే ఇప్పుడు అయన్ను చిక్కుల్లో పడేసింది. బౌద్ద స్థూపాల దగ్గర పూజలు ఏంటని బౌద్ధ సంఘాలు మండిపడుతున్నాయి. మంత్రి, అధికారులు ఏమాత్రం అవగాహన లేకుండా పూజలు చేశారని… అయ్యప్ప మాలధారణలో ఉన్న మంత్రి… తమ ఆచారాలు, సంప్రదాయాలకు విరుద్ధంగా నడుచుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
మంత్రి తీరునే కాదు… ప్రభుత్వ విధానాలను సైతం వారు తప్పుబడుతున్నారు. తొట్లకొండపై ధ్యాన కేంద్రాన్ని నెలకొల్పాలన్న సర్కార్ యోచనపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తొట్లకొండను కబ్జా చేయడానికే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వ తీరుమార్చుకోవాలని సూచిస్తున్నారు.