లింగమనేనితో చర్చకు సై : ఆర్కే సవాల్

  • Published By: madhu ,Published On : September 25, 2019 / 05:56 AM IST
లింగమనేనితో చర్చకు సై : ఆర్కే సవాల్

Updated On : September 25, 2019 / 5:56 AM IST

సీఎం జగన్‌కు లింగమనేని రాసిన లేఖపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్పందించారు. అసలు ఆయన గెస్ట్ హౌజ్‌కు అనుమతులు లేవని స్పష్టం చేశారు. కూల్చేస్తున్నారు..గుండె కోత ఉందంటున్న లింగమనేని..వాస్తవం ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు..లింగమనేని కలిసి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. హైకోర్టు ద్వారా నోటీసులు ఇప్పించడం జరిగిందని, తిరిగి కౌంటర్ దాఖలు చేసే ప్రయత్నం చేయని లింగమనేని..ప్రజల కోసం పనిచేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పాలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. 

సెప్టెంబర్ 25వ తేదీ బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ల్యాండ్ పూలింగ్ ఎక్కడైతే ఆగిందో..అక్కడనే లింగమనేని ఆస్తులున్నాయన్నారు. బాబు, లోకేష్‌లకు ఇంటి అద్దె ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఇలా వారు రూ. కోటి 20 లక్షలు HRA కింద ప్రజాధనం డ్రా చేసుకున్నారని తెలిపారు. వీరిద్దరూ డబ్బులు ఇచ్చారా ? లేదా తెలియచేయాలని లింగమనేనిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. డబ్బులు ఇస్తే..ఐటీ రిటర్న్‌లో చూపించారా ? లేక ఉచితంగా ఇస్తే..రూ. కోటి 20 లక్షలు బాబు..లోకేష్‌లు ఎలా డ్రా చేస్తారని సూటిగా ప్రశ్నించారు. 

పొన్నూరు నియోజకవర్గంలో 20 ఎకరాలు అప్పన్నంగా లింగమనేని కాజేశారని ఆరోపించారు. రెయిన్ త్రీ పార్కుకు ఎలా దారి వచ్చిందో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, వాస్తవాలు బయటపెడుతానన్నారు. ఈ పార్కుకు మంచినీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి.., ఇందుకు వేసిన పైపులైన్‌కు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి. కక్ష కట్టాల్సిన అవసరం సీఎం జగన్‌కు అవసరం లేదన్నారు. 
Read More : సీఎం జగన్‌కు వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌ లేఖ