ప్రశ్నించిన ఓటరుపై జేసీ బూతుల దండకం..అనుచరులతో దాడి

అనంతపురం జిల్లాలో జేసీ దివాకర్ రెడ్డి హవా అంతా ఇంతా కాదు. ఈ ఎన్నికల్లో కుమారుడు పవన్‌కుమార్ రెడ్డిని రంగంలోకి దింపిన జేసీ మరింత జోష్ గా ప్రచారంలో పాల్గొని హామీలను గుప్పిస్తున్నారు. స్థానికంగా ఉండే త్రాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఓ వ్యక్తి లేచి మాకు త్రాగునీటి సమస్య తీరనేలేదు అంటు ప్రశ్నించాడు. దీంతో జేసీ రెచ్చిపోయారు. కోపంతో ఊగిపోయారు. ప్రశ్నించిన వ్యక్తిపై తిట్ల పురాణం అందుకున్నారు. అంతటితో ఊరుకోకుండా తమ అనుచరులతో దాడి చేయించారు.దీంతో టీడీపీ కార్యకర్తలంతా బిత్తరపోయారు.
జేసీ దివాకర్‌రెడ్డి, టీడీపీ శింగనమల అభ్యర్థి శ్రావణశ్రీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పుట్లూరులో ఏర్పాటు చేసిన సభలో జేసీ మాట్లాడుతు..తమను మరోసారి గెలిపిస్తే చెరువుల నిండా నీటిని నింపి తాగునీటి సమస్యలు రాకుండా చేస్తామన్నారు. ఈ క్రమంలో సభ చివర్లో.. సార్..మా గ్రామంలో తాగేందుకు నీళ్లు లేవు అని వడ్డెర కాలనీకి చెందిన వెంకటనారాయణ అనే వ్యక్తి జేసీ ఎంపీ దృష్టికి తీసుకొచ్చాడు. దీంతో ఎంపీ దివాకర్‌రెడ్డి అతన్ని అసభ్య పదజాలంతో దుషించారు. ‘తాగి వచ్చి మాట్లాడుతున్నావ్.. నీకు ఎవరు తాగబోసారు అంటు మండిపడ్డారు. దీంతో అక్కడే ఉన్న జేసీ అనుసరులు వెంకటనారాయణపై మూకుమ్మడి దాడికి పాల్పడగా తీవ్రంగా గాయపడ్డాడు. ఓటర్లను బెదిరించిన జేసీ దివాకర్‌పై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రజలు డిమాండ్ చేశారు.