హిందూపుర్‌ను బెంగళూర్ చేస్తా: నందమూరి బాలకృష్ణ

  • Published By: vamsi ,Published On : March 22, 2019 / 08:02 AM IST
హిందూపుర్‌ను బెంగళూర్ చేస్తా: నందమూరి బాలకృష్ణ

Updated On : March 22, 2019 / 8:02 AM IST

అనంతపురం జిల్లా హిందూపురంలో తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు బయపల్దేరిన నందమూరి బాలకృష్ణ సుగూరు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల నుంచి తెలుగుదేశం పుట్టిందని, అయితే రాష్ట్రంలో కొన్ని దుష్టశక్తులు పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నాయంటూ బాలకృష్ణ విమర్శించారు.
Read Also : సొంతమామనే కుట్రచేసి చంపిన వ్యక్తి చంద్రబాబు : జగన్

ఎవరు ఎంత తప్పుడు ప్రచారం చేసినా కూడా రాబోయేది తెలుగుదేశం పార్టీయేనని బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. 150కిపైగా సీట్లలో తెలుగుదేశం విజయం సాధిస్తుందంటూ ఆయన స్పష్టం చేశారు. అలాగే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం.. అభివృద్ధిలో ముందంజలో ఉందని, రాబోయే రోజుల్లో మరో బెంగళూరు నగరంగా హిందూపురంను తీర్చిదిద్దుతానంటూ బాలకృష్ణ హామీ ఇచ్చారు. 
Read Also : ఎన్నిక‌ల టైంలో ఐటీ రైడ్స్ ఎలా చేస్తారు : ఈసీకి శివాజీ కంప్ల‌యింట్