హరికృష్ణ దూరమై ఏడాది: గుర్తు చేసుకున్న చంద్రబాబు

టీడీపీ మాజీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ చనిపోయి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. ఈ సమయంలో హరికృష్ణను గుర్తు చేసుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించారు.
‘‘తెలుగును ఎంతో అభిమానించే హరికృష్ణ.. తెలుగు భాషా దినోత్సవం రోజే చనిపోవడం దురదృష్టకరం అని, ఏదైనా ఆయన ముక్కుసూటిగా చెప్పేవారని అన్నారు. సినిమాల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నట్లు చెప్పారు. హరికృష్ణ మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం’’ అని చంద్రబాబు అన్నారు.
ఎన్టీఆర్ ఆదర్శాల బాటలో నడిచి ప్రజాబంధువుగా, సౌమ్యుడిగా ప్రజల హృదయాలలో శాశ్వతస్థానాన్ని సంపాదించుకున్న కీర్తిశేషులు హరికృష్ణగారు. ఆ మంచిమనిషి మనకు దూరమై ఏడాది గడిచినా మన మధ్యలోనే ఉన్నారనిపిస్తోంది. ఈరోజు హరికృష్ణగారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మీయ స్మృతులను స్మరించుకుందాం.
తెలుగుదేశం స్థాపించినపుడు పార్టీ గెలుపుకోసం నందమూరి హరికృష్ణ రాత్రింబవళ్లు కష్టించి పనిచేశారని చంద్రబాబు అన్నారు. ఆయన మృతిని ఇప్పటికీ జీర్ణించుకోకపోతున్నట్లు చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ ఆదర్శాల బాటలో నడిచి ప్రజాబంధువుగా, సౌమ్యుడిగా ప్రజల హృదయాలలో శాశ్వతస్థానాన్ని సంపాదించుకున్న కీర్తిశేషులు హరికృష్ణగారు. ఆ మంచిమనిషి మనకు దూరమై ఏడాది గడిచినా మన మధ్యలోనే ఉన్నారనిపిస్తోంది. ఈరోజు హరికృష్ణగారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మీయ స్మృతులను స్మరించుకుందాం. pic.twitter.com/BJ5lZQzZZ9
— N Chandrababu Naidu (@ncbn) August 29, 2019