నన్ను ఎగతాళి చేశారు.. అందుకే తెలుగు ఉండాలి

ఏపీలో మీడియం అంశంపై రగడ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వం నడుస్తోంది. ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని జగన్ ప్రభుత్వం

  • Published By: veegamteam ,Published On : November 21, 2019 / 11:14 AM IST
నన్ను ఎగతాళి చేశారు.. అందుకే తెలుగు ఉండాలి

Updated On : November 21, 2019 / 11:14 AM IST

ఏపీలో మీడియం అంశంపై రగడ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వం నడుస్తోంది. ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని జగన్ ప్రభుత్వం

ఏపీలో మీడియం అంశంపై రగడ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వం నడుస్తోంది. ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. మాతృభాష తెలుగుకి అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాగా, ఇంగ్లీస్ నేర్చుకుంటేనే పిల్లలు భవిష్యత్తులో ఉన్నత స్థానాలను చేరుకుంటారని వైసీపీ నేతలు అంటున్నారు.

మీడియం గొడవపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్ మీడియానికి టీడీపీ వ్యతిరేకం కాదని లోకేష్ అన్నారు. మాతృభాషను లేకుండా చేసే విధానాన్ని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో మున్సిపల్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామని గుర్తు చేసిన లోకేష్.. బలవంతంగా ఇంగ్లీష్ రుద్ద లేదని.. మీడియం ఎంచుకునే ఆప్షన్ విద్యార్థులకు ఇచ్చామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం తన ఆలోచనలను బలవంతంగా విద్యార్థులపై ప్రయోగించొద్దని లోకేష్ కోరారు.

తెలుగు రాకపోతే ఎంత ఇబ్బంది పడతామో తనకు బాగా తెలుసు అన్నారు లోకేష్. విదేశాల్లో ఎక్కువ కాలం చదువుకోడం వల్లే తాను తెలుగు నేర్చుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడైనా తాను ఒక పదం తప్పు పలికితే ఎగతాళి చేశారని వాపోయారు. ఇలాంటి పరిస్థితి పిల్లలకు రాకుండా ఉండాలంటే… మాతృభాష తెలుగు కూడా ఉండాలని కోరుకుంటున్నా అని లోకేష్ చెప్పారు.