ఇసుకపై ప్రభుత్వం నిర్ణయం : ఎక్కువ ధరకు అమ్మితే రెండేళ్లు జైలు

ఇసుక ధరలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇసుక ఎక్కువ ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. అక్రమాలకు పాల్పడినా, ఎక్కువ ధరకు ఇసుక అమ్మినా..

  • Published By: veegamteam ,Published On : November 12, 2019 / 08:02 AM IST
ఇసుకపై ప్రభుత్వం నిర్ణయం : ఎక్కువ ధరకు అమ్మితే రెండేళ్లు జైలు

Updated On : November 12, 2019 / 8:02 AM IST

ఇసుక ధరలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇసుక ఎక్కువ ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. అక్రమాలకు పాల్పడినా, ఎక్కువ ధరకు ఇసుక అమ్మినా..

ఇసుక ధరలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇసుక ఎక్కువ ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. అక్రమాలకు పాల్పడినా, ఎక్కువ ధరకు ఇసుక అమ్మినా.. రెండేళ్లు జైలు శిక్ష విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు రీచ్ లు సీజ్ చేయనున్నారు.

ఇసుక ధరలు, అమ్మకాల, కొరతపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇసుక కొరత లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులతో చెప్పారు. రెండు రోజుల్లో రేటు కార్డు డిసైడ్ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా రేటు కార్డులపై ప్రచారం చేయాలని సూచించారు. నవంబర్ 14 నుంచి నవంబర్ 21 వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని సీఎం జగన్ చెప్పారు.

ఏపీలో ఇసుక కొరతపై అధికార, ప్రతిపక్షాలు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం విధానాల వల్లే రాష్ట్రంలో ఇసుక కొరత వచ్చిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇసుక కొరత కారణంగా రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం కుదేలైందని.. ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టీడీపీ, జనసేన నేతలు వాపోయారు. ఇసుక కొరతపై ఇప్పటికే జనసేనాని పవన్ లాంగ్ మార్చ్ నిర్వహించారు.

చంద్రబాబు దీక్షకు కూర్చోబోతున్నారు. వైసీపీ నేతలు ఇసుకను ఇతర రాష్ట్రాలకు అక్రమరవాణ చేస్తున్నారని ఆరోపిస్తూ.. ఇసుక మాఫియాపై టీడీపీ చార్జిషీట్ దాఖలు చేసింది. కాగా, ప్రభుత్వం మాత్రం.. ఆరోపణలను ఖండిస్తోంది. వరదల వల్లే ఇసుక సమస్య వచ్చిందని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నారు.