అవినీతి చేస్తే ఇంటికే : ఫిర్యాదుల కోసం 14400

అవినీతిపై యుద్ధం ప్రకటించిన జగన్ సర్కార్ ఆ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తే ఇక డైరెక్ట్‌గా ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

  • Published By: veegamteam ,Published On : November 25, 2019 / 07:51 AM IST
అవినీతి చేస్తే ఇంటికే : ఫిర్యాదుల కోసం 14400

Updated On : November 25, 2019 / 7:51 AM IST

అవినీతిపై యుద్ధం ప్రకటించిన జగన్ సర్కార్ ఆ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తే ఇక డైరెక్ట్‌గా ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

అవినీతి నిర్మూలనకు కంకణం కట్టుకున్న జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తే డైరెక్ట్‌గా ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేయనుంది. దీనికి 14400 అనే టోల్‌ ఫ్రీ నంబర్‌ను కేటాయించారు. సోమవారం(నవంబర్ 25,2019) తాడేపల్లిలోని తన నివాసంలో సీఎం జగన్ టోల్ ఫ్రీ సేవలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. 

కొత్తగా ఏర్పాటు చేయనున్న 14400 టోల్‌ఫ్రీ నంబర్‌ ద్వారా వచ్చే ఫిర్యాదులను ఇంటలిజెన్స్, ఏసీబీ అధికారులు స్వయంగా పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల అవినీతిపై ఫిర్యాదులు అందితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు రుజువైతే నేరుగా ఇంటికి పంపేందుకు కూడా వెనుకాడేది లేదని ప్రభుత్వం స్ఫష్టం చేసింది.

ప్రభుత్వ కార్యాలయాలు, పౌర సేవల్లో అవినీతిపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) శాఖ 1064 టోల్‌ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది. అలాగే 8333995858 వాట్సాప్‌ నెంబర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తోంది. అందుకు ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ కూడా ఉంది. దానికితోడు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1100 కాల్‌ సెంటర్‌కూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వీటికి అదనంగా జగన్ ప్రభుత్వం మరో టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చింది.

అవినీతి లేని, పారదర్శక పాలన కోసం జగన్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేసింది. అవినీతిని ఏ రూపంలోనూ సహించేది లేదని చెబుతున్న జగన్ ప్రభుత్వం.. ఫిర్యాదుల కోసం మరో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయడాన్ని ఆహ్వానిస్తున్నారు. ఇలాంటి వాటి ద్వారా అవినీతికి చెక్ పెట్టొచ్చని అభిప్రాయపడ్డారు.