బాలికను గర్భవతిని చేసిన వృద్ధుడు

విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌లో దారుణం జరిగింది. 60 ఏళ్ల వృద్ధుడు మైనర్ బాలికను గర్భవతిని చేశాడు. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. రాజేశ్వరరావు పేటకు చెందిన వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు వృద్ధుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఐద్వా DYFI ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. బాధితురాలి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.