మంత్రి కళ్ళ ఎదుటే ఘోరం

విజయవాడ : నీటి పారుదల శాఖమంత్రి అనిల్ కుమార్ యాదవ్ చూస్తుండగానే ఒక వ్యక్తికృష్ణానదిలో పడి మరణించాడు. విజయవాడ ప్రకాశం బ్యారేజికి ఉన్న 68 వ నెంబరు గేటుకు పడవ అడ్డంపడి గత కొద్ది రోజులుగా నీరు దిగువకు పారుతోంది.
శనివారం గేటుకు అడ్డంగా ఉన్న పడవను ఇరిగేషన్ అధికారులు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో మంత్రి అనిల్ కుమార్ కూడా బ్యారేజివద్దకు చేరుకుని పనులను స్వయంగా పర్యవేక్షించారు. ఈ లోపు ఒక వ్యక్తి కృష్ణా నదిలో పడిపోయాడు. వరద ప్రవాహానికి ఆ వ్యక్తి నీటిలో పడి దిగువకు కొట్టుకుపోయాడు.
మంత్రి అనిల్ బ్యారేజి మీద నుంచి ఇది గమనించి ఆవ్యక్తిని కాపాడమని సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఇరిగేషన్ సిబ్బంది, మత్స్యకారులు ఆ వ్యక్తిని కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చిన కొద్దిసేపట్లోనే కన్ను మూశాడు. మరణించిన వక్తి ఆత్మ హత్య చేసుకున్నాడా… పొరపాటున పడిపోయాడా… అనే విషయాలు తెలియాల్సి ఉంది,