పల్నాడు హీట్ : బాబు నిజస్వరూపాన్ని ఎండగడుతాం – అంబటి

  • Published By: madhu ,Published On : September 11, 2019 / 07:48 AM IST
పల్నాడు హీట్ : బాబు నిజస్వరూపాన్ని ఎండగడుతాం – అంబటి

Updated On : September 11, 2019 / 7:48 AM IST

పల్నాడులో ఎలాంటి ఘోరాలు జరగడం లేదు..ఎవరినీ వేధించడం లేదు..బాబు నిజస్వరూపాన్ని ఎండగడుతాం..ప్రజల దృష్టిని మరల్చడానికి బాబు విష ప్రచారం చేస్తున్నారు…అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. వైసీపీ, టీడీపీ పార్టీలు చలో ఆత్మకూరుకు పిలుపునివ్వడంతో పల్నాడులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రభుత్వంపై బాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీనికి అంబటి కౌంటర్ ఇచ్చారు. సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం మీడియాతో అంబటి, పార్టీ నేతలు మాట్లాడారు. 

ఆత్మకూరుకు వెళుతామని పర్మిషన్ అడిగితే పోలీసులు రిజక్ట్ చేశారని వెల్లడించారు. గత పాలకుల హాయాంలో ఫ్యాక్షన్ గ్రామాలున్నాయని, వీటిని అణిచివేయడానికి  ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఆత్మకూరులో ఫ్యాక్షన్ అణిచివేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంటే..టీడీపీ విష ప్రచారం చేస్తోందని..దీనిని ఖండిస్తున్నట్లు తెలిపారు. పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకుని ఆత్మకూరుకు వెళ్లి..మీడియా సమక్షంలో విచారించి..వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియచేస్తామన్నారు.

తమను దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం బాబు చేశాడని, ప్రజల దృష్టిని మరల్చడానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీలో ఉన్న కీలక నేతలు చేసిన నేరాలను పోలీసులు బయటకు తీస్తున్నారని, వారిపై కేసులు పెడుతున్నారని గుర్తు చేశారు. వీటన్నింటినీ పక్కదోవ పట్టించడానికి బాబు ఈ విధంగా ప్లాన్ చేశారని అంబటి వెల్లడించారు.