రెండూ ఉత్తరాంధ్రలోనే : భీమవరం, గాజువాక నుంచి పవన్ పోటీ
ఒంటరిగా అన్ని స్థానాల నుంచి పోటీకి రెడీ అయిన జనసేన పార్టీ.. అధ్యక్షుడు పోటీ చేసే రెండు స్థానాలను కూడా ఒకే ప్రాంతానికి పరిమితం చేయటం విశేషం.

ఒంటరిగా అన్ని స్థానాల నుంచి పోటీకి రెడీ అయిన జనసేన పార్టీ.. అధ్యక్షుడు పోటీ చేసే రెండు స్థానాలను కూడా ఒకే ప్రాంతానికి పరిమితం చేయటం విశేషం.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే రెండు నియోజకవర్గాలు విడుదల అయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఓ నియోజకవర్గం అయితే.. విశాఖ జిల్లా గాజువాక మరో స్థానం. ఈ రెండు సీట్లు ఉత్తరాంధ్రలోనే ఉండటం విశేషం. గత కొన్నిరోజులుగా పవన్ పోటీ చేసే స్థానాల విషయమై చర్చలు జరిగిన అనంతరం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ పోటీ చేసే రెండు స్థానాలను ఒకే ప్రాంతానికి పరిమితం అయ్యారు. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలపై ప్రభావం చూపే నియోజకవర్గాలను ఎంచుకునే దిశగా ఆలోచన చేసిన జనసేనాని చివరకు గాజువాక, భీమవరం ఎంచుకున్నారు.
Read Also : ఒక్కటి సరిపోదు : అన్నయ్యలాగే పవన్ కళ్యాణ్ కూడా!
పవన్ రెండు సీట్ల నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటన రాగానే.. ఒకటి ఉత్తరాంధ్ర, మరొకటి రాయలసీమ అనే ప్రచారం జరిగింది. సీమ నుంచి కూడా పవన్ పోటీ చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని అందరూ భావించారు. అందుకు విరుద్ధంగా ప్రకటన రావటం విశేషం.
పవన్ కల్యాణ్ పోటీ చేసే ఓ సీటు అయిన భీమవరంలో వైసీపీ అభ్యర్థిగా గ్రంథి శ్రీనివాస్ ఉన్నారు.. టీడీపీ నుంచి పులపర్తి రామాంజనేయులు ఉన్నారు. వీరిద్దరితో పవన్ పోటీ పడనున్నారు. ఇక గాజువాక నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా తిప్పల నాగిరెడ్డి బరిలో ఉంటే.. టీడీపీ నుంచి పల్లా శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. పల్లా శ్రీనివాస్ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ రెండు నియోజకవర్గాల్లో 2014లో టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. ఈ స్థానాల నుంచే పవన్ కల్యాణ్ పోటీ చేయటం ఆసక్తి రేపుతోంది. ఒకే ప్రాంతం నుంచి రెండు సీట్లలో ఓ పార్టీ అధినేత పోటీ చేయటం ఇదే ఫస్ట్ టైం. గతంలో చాలా మంది రెండు సీట్ల నుంచి బరిలోకి దిగినా.. వేర్వేరు ప్రాంతాల్లోని సీట్ల నుంచి పోటీ చేశారు.
Read Also : వైసీపీది నేరగాళ్ళ ప్రకటన : టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు