పవన్ పంచ్ : రాజకీయాలు బాబు, జగన్ కుటుంబాలే చెయ్యాలా

కృష్ణా: రాజకీయాలంటే చంద్రబాబు, జగన్ కుటుంబాలే చెయ్యాలా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రాజకీయాలు సామాన్యులు చెయ్యకూడదా అని నిలదీశారు. ఈ

  • Published By: veegamteam ,Published On : March 24, 2019 / 12:47 PM IST
పవన్ పంచ్ : రాజకీయాలు బాబు, జగన్ కుటుంబాలే చెయ్యాలా

Updated On : March 24, 2019 / 12:47 PM IST

కృష్ణా: రాజకీయాలంటే చంద్రబాబు, జగన్ కుటుంబాలే చెయ్యాలా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రాజకీయాలు సామాన్యులు చెయ్యకూడదా అని నిలదీశారు. ఈ

కృష్ణా: రాజకీయాలంటే చంద్రబాబు, జగన్ కుటుంబాలే చెయ్యాలా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రాజకీయాలు సామాన్యులు చెయ్యకూడదా అని నిలదీశారు. ఈ వారసత్వాన్ని మార్చి చూపిస్తా అన్నారు. పాత కోటలను బద్దలుకొట్టి కొత్త రాజకీయాలు తెస్తా అన్నారు. ఎన్నికల్లో సత్తా చాటి.. త్వరలో సీఎంగా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తానని పవన్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం(మార్చి 24, 2019) కృష్ణా జిల్లా కైకలూరులో జనసేన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు, జగన్ లపై పవన్ మండిపడ్డారు.

పులివెందుల వేషాలు తన దగ్గర వేస్తే ఊరుకునేది లేదని పవన్ హెచ్చరించారు. కొంతమంది రాయలసీమను రక్తసీమగా మార్చారని అన్నారు. పులివెందుల బంధనాల నుంచి యువత బయటపడాలని చూస్తోందన్నారు. పేపర్, ఛానల్ ఉన్నాయని పిచ్చి రాతలు రాస్తే తాట తీస్తాను జాగ్రత్త అంటూ హెచ్చరించారు. విజయసాయిరెడ్డి పిచ్చి, పిచ్చిగా మాట్లాడుతున్నారని.. తాట తీస్తాను జాగ్రత్త అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మర్యాద ఇస్తుంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ఇక ఊరుకునేది లేదని పవన్ అన్నారు.

తమ పార్టీ అభ్యర్థుల్ని ఎంపిక చేయాలంటే జగన్, విజయసాయి పర్మిషన్ తీసుకోవాలా అని పవన్ ప్రశ్నించారు. వైసీపీ హైదరాబాద్‌లో కూర్చొని కేసీఆర్ అనుమతితో బీఫారాలు ఇస్తోందన్నారు. ఏపీలో ఎవరు పోటీ చేయాలో నిర్ణయించేది టీఆర్ఎస్ నేతలా అంటూ ప్రశ్నించారు. దమ్ము, ధైర్యంతో అన్నింటికి తెగించి రాజకీయాల్లోకి వచ్చానని పవన్ స్పష్టం చేశారు. చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోయారని విమర్శించారు.