పవన్ స్టైల్ : పంచెకట్టు..వేపచెట్టు..మట్టి ముంతలో మజ్జిగన్నం
ఏపీ ఎన్నికల బరిలో నువ్వా నేనా అంటు పార్టీలు ప్రచారాల్లో దూసుకుపోతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటున్నారు.

ఏపీ ఎన్నికల బరిలో నువ్వా నేనా అంటు పార్టీలు ప్రచారాల్లో దూసుకుపోతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటున్నారు.
ఏపీ ఎన్నికల బరిలో నువ్వా నేనా అంటు పార్టీలు ప్రచారాల్లో దూసుకుపోతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటున్నారు. ప్రచారంలో జనసేనాని పవన్ సింప్లిసిటీ ఇప్పుడు వైరల్ గా మారింది. నెట్టింట ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు చెందిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.
Read Also : ఈసీ ముందుకు లక్ష్మీ’స్ ఎన్టీఆర్ నిర్మాత.. ఏం జరుగుతుంది?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం (మార్చి 24) కృష్ణా జిల్లాలో పర్యటించిన జగన్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. జగన్, చంద్రబాబులపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ముందుకు సాగుతున్నారు. మంగినపూడి లైట్ హౌస్ వద్ద కాసేపు విశ్రాంతి తీసుకున్న పవన్.. తాటి చాపపై కూర్చుని మట్టి ముంతలో జొన్న అన్నం తిని, కాసేపు సేద తీరారు.
పంచెకట్టులో వేపచెట్టు కింద కూర్చుని జొన్న అన్నం తింటున్న పవన్ వీడియో, ఫొటోలను జనసేన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి. పవన్ సింప్లిసిటీకి ఇది నిలువెత్తు నిదర్శనమంటూ ఆయన అభిమానులు ఆకాశానికెత్తేస్తున్నారు.
JanaSena Chief this evening. pic.twitter.com/M4RqkbBIH2
— JanaSena Party (@JanaSenaParty) March 24, 2019