మీటింగ్ లో వాంతులు : పీఏసీ చైర్మన్ పయ్యావులకు అస్వస్థత

పీఏసీ చైర్మన్, ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అమరావతిలో అసెంబ్లీ కమిటీ హాల్‌లో పీఏసీ తొలి సమావేశం జరుగుతోంది. ఈ

  • Published By: veegamteam ,Published On : November 7, 2019 / 09:21 AM IST
మీటింగ్ లో వాంతులు : పీఏసీ చైర్మన్ పయ్యావులకు అస్వస్థత

Updated On : November 7, 2019 / 9:21 AM IST

పీఏసీ చైర్మన్, ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అమరావతిలో అసెంబ్లీ కమిటీ హాల్‌లో పీఏసీ తొలి సమావేశం జరుగుతోంది. ఈ

పీఏసీ చైర్మన్, ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అమరావతిలో అసెంబ్లీ కమిటీ హాల్‌లో పీఏసీ తొలి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు లోనయ్యారు. వాంతులు చేసుకున్నారు. కడుపు నొప్పితో బాధపడ్డారు.

వెంటనే స్పందించిన సిబ్బంది.. సచివాలయంలోని థర్డ్ బ్లాక్‌లో ఉన్న డిస్పెన్సరీకి పయ్యావులను తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. తర్వాత 108 వాహనంలో విజయవాడలోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. 

ప్రస్తుతం పయ్యావుల ఆరోగ్యం మెరుగ్గానే ఉందని డాక్టర్లు తెలిపారు. అసిడిటీ వల్లే పయ్యావుల అస్వస్థతకు గురయ్యారని వెల్లడించారు.