జనవరి 1 నుంచి రూ.10వేలు పెన్షన్

ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు విస్తరించుకుంటూ పోతున్నారు. అన్నివర్గాల వారిని ఆదుకునేలా, సాయం అందేలా చర్యలు చేపడతున్నారు. ఇప్పటికే అనేక

  • Published By: veegamteam ,Published On : October 10, 2019 / 11:57 AM IST
జనవరి 1 నుంచి రూ.10వేలు పెన్షన్

Updated On : October 10, 2019 / 11:57 AM IST

ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు విస్తరించుకుంటూ పోతున్నారు. అన్నివర్గాల వారిని ఆదుకునేలా, సాయం అందేలా చర్యలు చేపడతున్నారు. ఇప్పటికే అనేక

ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు విస్తరించుకుంటూ పోతున్నారు. అన్నివర్గాల వారిని ఆదుకునేలా, సాయం అందేలా చర్యలు చేపడతున్నారు. ఇప్పటికే అనేక పథకాలకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్.. తాజాగా మరో వరాన్ని ప్రకటించారు. కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు, తలసేమియా రోగులకు నెలకు రూ.10 వేల ఆర్థిక వేల సాయం చేయనున్నట్టు ప్రకటించారు. జనవరి 1 నుంచి వారికి రూ.10 వేల పెన్షన్‌ ఇస్తామన్నారు. ప్రతి నెల రూ.10వేలు అందుతుందన్నారు.

అలాగే పక్షవాతం, కండరాల క్షీణతతో బాధపడుతున్న వారికి కూడా పింఛను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోగులకు నెలకు రూ.5 వేల పెన్షన్‌ ఇస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. ఆపరేషన్‌ చేయించుకున్న తర్వాత పూర్తిగా కోలుకునే వరకు కూడా నెలకు రూ.5 వేలు పెన్షన్‌ ఇస్తారు.

గురువారం(అక్టోబర్ 10,2019) అనంతపురంలో వైఎస్ఆర్ కంటి వెలుగు పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. త్వరలో 432 కొత్త 108 వాహనాలను ప్రారంభిస్తామన్నారు. 676 కొత్త 104 వాహనాలు త్వరలో అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

డిసెంబర్ 21 నుంచి ఏపీలో కొత్త ఆర్యోశ్రీ కార్డులు ఇస్తామని సీఎం చెప్పారు. వైద్య ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామన్నారు. నవంబర్‌ 1 నుంచి హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఎంపిక చేసిన 150 ఆస్పత్రులలో వైద్యం చేయించుకున్నా నిరుపేదలకు ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తామన్నారు. కొత్త కార్డుల్లో 2వేల వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేరుస్తామన్నారు. డెంగ్యూ, మలేరియా వ్యాధులకూ ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తామన్నారు. 

నేను అనంతపురం జిల్లా మనవడిని.. మా అమ్మ విజయమ్మ మీ జిల్లా ఆడపడుచు.. మీ జిల్లా రూపురేఖలు మారుస్తానని హామీ ఇస్తున్నా అని సీఎం జగన్ హామీ ఇచ్చారు. వెనకబడిన ప్రాంతాల్లో కొత్తగా మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. పలాస, మర్కాపురం ప్రాంతాల్లో కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తామన్నారు. డిసెంబర్‌లో ప్రజలందరికీ కొత్త ఆరోగ్యకార్డులు ఇస్తామన్నారు.