తిరుమలలో ప్లాస్టిక్ నిషేధానికి పటిష్ట చర్యలు 

  • Published By: veegamteam ,Published On : November 12, 2019 / 10:46 AM IST
తిరుమలలో ప్లాస్టిక్ నిషేధానికి పటిష్ట చర్యలు 

Updated On : November 12, 2019 / 10:46 AM IST

తిరుమలలో ప్లాస్టిక్ నిషేధానికి పటిష్ట చర్యలు తీసుకుంటామని అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. విడతలు వారిగా చేపట్టి మూడు దశల్లో తిరుమలలో ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగాన్ని నిషేధిస్తామని తెలిపారు. భక్తులే కాకుండా టీటీడీ కార్యాలయాల్లో కూడా ప్లాస్టిక్ బాటిల్స్ వియోగించకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ విషయంపై భక్తులకు అవగాహన కల్పిస్తామనీ..తిరుమలలోని ఏ రెస్టారెంట్ ల్లో కూడా వాటర్ బాటిళ్లు విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకుంటామనీ..జల ప్రసాదం నీటిని వాడేలా సూచనలు చేస్తామనీ తెలిపారు. సబ్సీడీ లడ్డూ టోకెన్ లు దుర్వినియోగం  కాకుండా చూస్తామని అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.