మావోలకు దెబ్బ : బుల్లెట్ గాయాలతో దొరికిపోయిన అగ్రనేత భార్య
మావోయిస్టులకు మరో గట్టి ఎదురు దెబ్బ తగలింది. దళంలో కీలక మహిళా మావోయిస్టు పోలీసులకు చిక్కింది. గాలికొండ-గుత్తేడు ప్రాంతంలో మావోయిస్టు నేత సాకె కళావతి అలియాస్

మావోయిస్టులకు మరో గట్టి ఎదురు దెబ్బ తగలింది. దళంలో కీలక మహిళా మావోయిస్టు పోలీసులకు చిక్కింది. గాలికొండ-గుత్తేడు ప్రాంతంలో మావోయిస్టు నేత సాకె కళావతి అలియాస్
మావోయిస్టులకు మరో గట్టి ఎదురు దెబ్బ తగలింది. దళంలో కీలక మహిళా మావోయిస్టు పోలీసులకు చిక్కింది. గాలికొండ-గుత్తేడు ప్రాంతంలో మావోయిస్టు నేత సాకె కళావతి అలియాస్ భవానీ బుల్లెట్ గాయాలతో పోలీసులకి పట్టుబడినట్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మావోయిస్టు స్టేట్ జోన్ కమిటీ మెంబర్ జగన్ భార్య భవానీ.. పెదబైలు ఏరియా కమిటీ మెంబర్‌గా పని చేస్తోందన్నారు. 20 ఏళ్లుగా మావో ఉద్యమంలో వివిధ విభాగాల్లో ఆమె పని చేసిందన్నారు. భవానీని కోర్టులో హాజరుపరిచిన తర్వాత చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరిలించినట్లు డీజీపీ వివరించారు. విశాఖ మన్యంలో ఇంకా కూంబింగ్ కొనసాగుతోందన్నారు.
తూర్పుగోదావరి సరిహద్దులో మావోయిస్టు భవానీ బుల్లెట్ గాయాలతో పట్టుబడిన విషయాన్ని రూరల్ ఎస్పీ బాబూజీ ధృవీకరించారు. మావోయిస్టు భవానీపై 33 కేసులు ఉన్నాయన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరఫున సాయం చేస్తామన్నారు. ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టు మృతదేహాలు భద్రపరిచాము అన్నారు.
కాగా, మావోయిస్టు పార్టీ ఏవోబీ మిలటరి కమిషన్ చీఫ్ చలపతి భార్య అరుణను ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. గతవారం జరిగిన గూడెం కొత్తవీధి మండలం మాదిగమల్లు ఎన్‌కౌంటర్‌లో గాయపడిన అరుణకు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అరుణతో పాటు గాయపడిన మరో మావోయిస్టు సభ్యురాలు భవానీకి తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం వీరిద్దరూ కోలుకోవడంతో విచారణ నిమిత్తం ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.